twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RAVANASURA: ఎవరూ ఊహించని పాత్రలో రవితేజ.. యంగ్ బ్యూటీని పట్టించేందుకు ఇలా!

    |

    స్వయంకృషితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. సుదీర్ఘ కాలం పాటు కష్టాలను అనుభవించిన తర్వాత స్టార్ హీరోగా ఎదిగాడు రవితేజ. మరీ ముఖ్యంగా తన సినిమాలతో బీ, సీ సెంటర్ల అభిమానులను అలరిస్తూ మాస్ మహారాజా అనే బిరుదును సొంతం చేసుకున్నాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని ఈ స్టార్ హీరో.. హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే చాలా విజయాలను అందుకున్నాడు. ఇక, ఇలాగే గత ఏడాది 'క్రాక్' మూవీతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను సొంతం చేసుకున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు.

    ఒంటిపై నూలుపోగు లేకుండా ఇలియానా రచ్చ: ఇది మామూలు అరాచకం కాదుగా!ఒంటిపై నూలుపోగు లేకుండా ఇలియానా రచ్చ: ఇది మామూలు అరాచకం కాదుగా!

    'క్రాక్' హిట్ తర్వాత రవితేజ.. రమేశ్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి' అనే సినిమాను మొదలు పెట్టాడు. కానీ, అనివార్య కారణాల వల్ల షూటింగ్ మాత్రం ఇప్పటి వరకూ పూర్తి కాలేదు. అయినప్పటికీ చిత్ర యూనిట్ పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగానే ఈ సినిమాను ఫిబ్రవరి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో రవితేజ డబుల్ రోల్ చేస్తున్నాడు. మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. పెన్‌ స్టూడియోస్‌ సమర్పణలో హవీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్‌ దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు.

    Ravi Teja Lawyer Role in RAVANASURA Movie

    అలాగే, శరత్ మందవతో రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' అనే సినిమాను చేస్తున్నాడు. ఇందులో దివ్యాన్షా కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో రవితేజ ప్రభుత్వ ఉద్యోగిగా నటిస్తోన్నాడు. ఈ మూవీ షూటింగ్ కూడా చాలా వరకూ పూర్తైంది. దీన్ని వచ్చే ఏడాది మార్చి 25న విడుదల కాబోతుంది. వీటితో పాటు ఈ మాస్ హీరో త్రినాథరావు నక్కినతో రవితేజ 'ధమాకా' అనే సినిమాను కూడా ప్రకటించాడు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

    షర్ట్ మొత్తం విప్పేసి అఖండ హీరోయిన్ రచ్చ: ఘాటు ఫోజులో అందాలన్నీ చూపిస్తూ అలా!షర్ట్ మొత్తం విప్పేసి అఖండ హీరోయిన్ రచ్చ: ఘాటు ఫోజులో అందాలన్నీ చూపిస్తూ అలా!

    రవితేజ లైనప్‌లో ఉన్న మరో సినిమానే 'రావణాసుర'. టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ తెరకెక్కించబోతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న పూజా కార్యక్రమాలను గ్రాండ్‌గా జరుపుకోబోతుంది. ఈ సినిమా నుంచి తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం.. ఇందులో రవితేజ లాయర్‌గా నటించబోతున్నాడట. ఇందులో భాగంగానే ఈ సినిమాలో విలన్‌గా చేస్తున్న దక్ష నాగర్కర్ ఆట కట్టించేందుకు పావులు కదుపుతాడని తెలుస్తోంది. దీంతో ఈ సినిమా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపొందనుందన్న విషయం అర్థం అవుతోంది. తద్వారా ఈ మూవీపై అంచనాలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి.

    'రావణాసుర' మూవీ ప్రీ లుక్ పోస్టర్‌కు అన్ని వర్గాల వాళ్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా దీనిపై అప్పుడే అంచనాలు ఏర్పడ్డాయి. అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్ మీద అభిషేక్ నామా, శ్రీకాంత్ విస్సా కలిసి నిర్మిస్తున్నారు. ఇక, ఈ సినిమా జనవరి చివరి వారం నుంచి రెగ్యూలర్ షూటింగ్ జరుపుకోనుందన్న టాక్ వినిపిస్తోంది.

    English summary
    Ravi Teja Recently Announced His RAVANASURA Movie Under RAVANASURA Directions. Ravi Teja to play Lawyer Role in This Movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X