EAGLE: రవితేజ మూవీలో హైలైట్ లీక్.. ఇప్పటి వరకూ ఏ మూవీలో చూపించని విధంగా!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోలు అతి తక్కువ మంది మాత్రమే ఉన్నారు. అందులో మాస్ మహారాజా రవితేజ ఒకడు. కెరీర్ ఆరంభం నుంచీ అదే పంథాను ఫాలో అవుతోన్న అతడు.. గత ఏడాది ఏకంగా మూడు సినిమాలతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.

మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రమే 'ఈగల్'. టాలెంటెడ్ గాయ్ కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫుల్ లెంగ్త్ యాక్షన్‌తో రూపొందింది. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా రోజుల క్రితమే కంప్లీట్ అయింది. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను సైతం పూర్తి చేసుకున్నారు. ఇలా దీన్ని సంక్రాంతి బరిలో నిలపాలని భావించారు.

Ravi Teja Love Track will be Major Highlight In EAGLE Movie

వాస్తవానికి 'ఈగల్' మూవీని ఈ ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా అప్పుడు దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాలేకపోయారు. అయితే, ఫిబ్రవరి 8వ తేదీన ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఇక, దీనికి సమయం దగ్గర పడడంతో ఈ మూవీ యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను సైతం ముమ్మరం చేసేసింది.

క్రేజీ కాన్సెప్టుతో రాబోతున్న 'ఈగల్' మూవీకి సంబంధించి ఇప్పటికే ఎన్నో ఆసక్తికరమైన అంశాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ చిత్రం నుంచి మరో క్రేజీ న్యూస్ లీకైంది. దీని ప్రకారం.. ఈ సినిమాలో రవితేజ లవ్ ట్రాక్ ఎంతో హైలైట్ కాబోతుందట. ఇది గతంలో ఏ తెలుగు సినిమాలో చూడని విధంగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

Ravi Teja Love Track will be Major Highlight In EAGLE Movie

ఫుల్ లెంగ్త్ యాక్షన్‌తో రూపొందుతోన్న 'ఈగల్' మూవీలో రవితేజ క్యారెక్టర్ ఎంతో కొత్తగా ఉంటుందని ఇప్పటికే చిత్ర యూనిట్ తెలిపింది. అందుకు తగ్గట్లుగానే ఇందులో అతడి లవ్ ట్రాక్‌ను డిఫరెంట్‌గా ఆలోచించి పెట్టారని అంటున్నారు. మొత్తానికి 'ఈగల్' మూవీలో వచ్చే ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయని గట్టిగా వినిపిస్తోంది.

ఇదిలా ఉండగా.. 'ఈగల్' సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిబొట్ల సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దీనికి Davzand సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో నవదీప్, శ్రీనివాస్ అవసరాల, కావ్య తాపర్, మధు బాల సహా ఎంతో మంది ప్రముఖులు నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X