ఆసక్తి రేపుతున్న రవితేజ డిస్కోరాజా టైటిల్ లోగో.. ఆ రెండు కొట్టేశారు!
మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం విఐ ఆనంద్ దర్శత్వంలో నటిస్తున్నాడు. చాలా కాలంగా ఈ చిత్రానికి డిస్కోరాజా అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. నేడు రవితేజ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. డిస్కోరాజా టైటిల్ ఖరారు చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. దర్శకుడు విఐ ఆనంద్ గతంలో ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం లాంటి థ్రిల్లర్ చిత్రాలని రూపొందించాడు. ఈ చిత్రం కూడా అదే తరహాలో సైంటిఫిక్ ఎలిమెంట్స్ తో ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
దర్శకుడు టైటిల్ లోగోతోనే చిత్రంపై ఆసక్తిని పెంచేశాడు. టైటిల్ పోస్టర్ లో 'is' అనే ఆంగ్ల పదాన్ని కొట్టేసి 'was' అని రాశారు. టైటిల్ కింది భాగంలో రివైండ్, ఫాస్ట్ ఫార్వార్డ్, ప్లే, కిల్ అనే పదాలు ఉన్నాయి. ఇందులో ప్లేని కొట్టేశారు. దీనినిబట్టి ఏ చిత్రంలో బలమైన ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రవితేజకు ఈ చిత్రం విజయం సాధించడం చాలా ముఖ్యం. రవితేజ ఇటీవల నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం చెందుతున్న సంగతి తెలిసిందే.

రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. పాయల్ రాజ్ పుత్, నభా నటేష్ హీరోయిన్లుగా ఎంపికైనట్లు తెలుస్తోంది. తాజాగా ఈ చిత్ర షూటింగ్ ని కూడా ప్రారంభించారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో డిస్కోరాజా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











