హ్యాట్రిక్ కాంబినేషన్: ప్లాపుల్లో ఉన్న రవితేజను గట్టెక్కించేందుకేనా?

మాస్ మహారాజ్ రవితేజ వరుస ప్లాపులతో సతమతం అవుతున్నారు. ఒకప్పుడు వరుస హిట్లతో ప్రేక్షకులను అలరించిన ఈ మాస్ హీరో ఎందుకనే ఈ మధ్య ప్రేక్షకుల నాడి అంచనా వేయడంలో విపలం అవుతున్నాడు. చివరగా 2017లో 'రాజాది గ్రేట్' సినిమా ద్వారా సక్సెస్ చూసిన రవితేజ... 2018లో చేసిన 'టచ్ చేసి చూడు', 'నేల టిక్కెట్', 'అమర్ అక్బర్ ఆంటోనీ' చిత్రాలతో వరుస పరాజయాలు తన ఖాతాలో వేసుకున్నాడు.

రవితేజను గట్టెక్కించడానికేనా? అన్నట్లు తాజాగా హ్యాట్రిక్ కాంబినేషన్ సెట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రవితేజతో డాన్ శీను, బలపు లాంటి విజయవంతమైన చిత్రాలను రూపొందించిన గోపీచంద్ మలినేని మూడో సారి మాస్ మహారాజతో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Ravi Teja next movie with director Gopichand Malineni

రవితేజ వరుస పరాజయాలను పరిశీలించిన గోపిచంద్ మలినేని... ఎలాంటి కథ అయితే మళ్లీ టాలీవుడ్లో ఈ మాస్ హీరో పేరు మారుమ్రోగిపోతుందో అంచనా వేసి అందుకు తగిన కథను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు నిర్మించబోతున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుతం రవితేజ 'డిస్కో రాజా' అనే చిత్రం చేస్తున్నారు. వి‌ఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్‌ఆర్‌టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రవితేజతో 'నేల టిక్కెట్' మూవీ చేసిన రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ర‌వితేజ‌, ‌పాయ‌ల్ రాజ్‌పుత్, నభా నటేష్, బాబీ‌సింహా, వెన్నెల‌ కిషోర్, స‌త్య‌ త‌దిత‌రులు నటిస్తున్నారు.

'డిస్కో రాజా' ఆగిపోయిందనే వార్తలు బాగా వైరల్ అవుతుండటం గమనించిన చిత్రయూనిట్ స్పందించింది. డిస్కో రాజా సెకండ్ షెడ్యూల్ తేదీని ప్రకటించింది. మే 27 వ తేదీ నుంచి సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X