ఎనిమిదేళ్లకే రక్తం తాగిన క్రిమినల్.. అదిరిపోయిన రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' టీజర్

వరుస పెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు మాస్ మహారాజా రవితేజ. గతేడాది ధమాకాతో డబుల్ ట్రీట్ ఇచ్చిన రవితేజ ఈ సంవత్సరం సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవితో కలిసి వాల్తేరు వీరయ్యతో సందడి చేశాడు. ఆ వెనువెంటనే రావణాసుర మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అంతగా ఆకట్టుకోలేదు. రావణాసురతో కొత్త రోల్ చేసిన రవితేజ ఇప్పడు యావత్ తెలుగు ప్రేక్షకులు అవాక్కయ్యే పాత్రతో అలరించనున్నాడు మాస్ మహారాజా. రవితేజ మరో విభిన్న పాత్ర చేస్తున్న సినిమా 'టైగర్ నాగేశ్వరరావు' (Tiger Nageswara Rao). తాజాగా దీని టీజర్ విడుదల చేశారు. ఆ విశేషాలు ఓసారి చూస్తే..

మంచి రెస్పాన్స్ : డైరెక్టర్ వంశీ కృష్ణ (Vamsi Krishna) దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం 'టైగర్ నాగేశ్వరరావు' (Tiger Nageswara Rao). ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. దానికి తగినట్లుగానే సినిమా మేకింగ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల రాజమండ్రిలో చాలా గ్రాండ్ గా టైగర్ నాగేశ్వరరావు ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Ravi Teja Nupur Sanon Tiger Nageswara Rao Teaser Released

పెరిగిన అంచనాలు : ఇటీవల టైగర్ నాగేశ్వరరావు టీజర్ ను Tiger's Invasion (దాడి) పేరుతో విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. చెప్పినట్లుగానే తాజాగా ఇవాళ అంటే ఆగస్ట్ 17న టైగర్ నాగేశ్వరరావు టీజర్ (Tiger Nageswara Rao Teaser) రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఫస్ట్ లుక్ గ్లింప్స్ కు మించి ఉంది. టీజర్ తో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.

Ravi Teja Nupur Sanon Tiger Nageswara Rao Teaser Released

అన్నిటికి మించి : ఎవరూ ఊహించని రీతిలో రవితేజ ఆహార్యం, పాత్ర తీరు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆయన మేకోవర్ తోపాటు సన్నివేశాలు ఔరా అనిపించేలా ఉన్నాయి. ఇప్పటివరకు రవితేజ వైవిధ్యభరిత, పవర్ ఫుల్ రోల్స్ చేశారు. కానీ, స్టువర్టుపురం నాగేశ్వరరావు పాత్ర మాత్రం వాటన్నింటికి మించి అనేలా ఉంది. ఇందులో కూడా డైలాగ్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా బీజీఎమ్ మరో స్థాయికి తీసుకెళ్లేలా ఉంది.

Ravi Teja Nupur Sanon Tiger Nageswara Rao Teaser Released

క్రిమినల్ అయ్యాడు : "ఈ జైలు నుంచి తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు అనే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభం అయింది. నాగేశ్వర రావు రాజకీయాల్లోకి వెళ్లి ఉంటే వాడి తెలివితేటలతో ఎలక్షన్స్ గెలిచేవాడు. స్పోర్ట్స్ లోకి వెళ్లి ఉంటే వాడి పరువుతో ఇండియాకు మెడల్ గెలిచేవాడు. ఆర్మీలోకి వెళ్లి ఉంటే వాడి ధైర్యంతో ఒక యుద్ధమే గెలిచేవాడు. కానీ, దురదృష్టవశాత్తు ఒక క్రిమినల్ అయ్యాడు సార్" అని మురళి శర్మ చెప్పే డైలాగ్ అదిరిపోయింది.

Ravi Teja Nupur Sanon Tiger Nageswara Rao Teaser Released

ఎనిమిదేళ్లకే : "అంతేకాకుండా పులి, సింహం కూడా ఒక వయసు వరకు పాలే తాగుతాయి. కానీ, వాడు ఎనిమిదేళ్లకే రక్తం తాగడం మొదలు పెట్టాడనే" డైలాగ్ వచ్చినప్పుడు ఒక బాబు ఎవరిదో తల పట్టుకుని వచ్చే సీన్ నెక్ట్స్ లెవెల్ ఎలివేషన్ లా ఉంది. ఇలా ఒక్కో అంశంతో ఆద్యంతం ఉత్కంఠంగా ఉంది టైగర్ నాగేశ్వరరావు టీజర్. కాగా ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 20న ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు.

తొలి తెలుగు మూవీ : టైగర్ నాగేశ్వరరావు సినిమాలో రవితేజకు జోడీగా హీరోయిన్ కృతి సనన్ (Kriti Sanon) చెల్లెలు నూపుర్ సనన్ (Nupur Sanon) నటించనుంది. ఇదే ఆమెకు తొలి తెలుగు చిత్రం. మరో హీరోయిన్ గా గాయత్రి భరద్వాజ్ చేస్తోంది. ది కశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 సినిమాల నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఇందులో అనుపమ్ ఖేర్, రేణు దేశాయ్, జిషు సేన్ గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X