ఎమ్మార్వో ఉద్యోగంలో చేరిన రవితేజ: వాళ్ల కోసం త్యాగానికి సిద్ధమైన మాస్ హీరో
చాలా కాలంగా హిట్ కోసం వేచి చూస్తోన్న తరుణంలో ఈ ఏడాది ఆరంభంలో 'క్రాక్'తో భారీ విజయాన్ని అందుకున్నాడు మాస్ మహారాజా రవితేజ. సక్సెస్ మాత్రమే కాదు.. కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ జోష్‌లోనే ఆ వెంటనే రమేష్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడీ' అనే సినిమాను ప్రారంభించేశాడు. ఇది చాలా వరకూ షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. అయితే, చివరి షెడ్యూల్‌కు కరోనా సెకెండ్ వేవ్ రూపంలో అడ్డంకులు ఏర్పడ్డాయి. దీంతో దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మరో చిత్రాన్ని లైన్‌లో పెట్టేశాడు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ కూడా మొదలైపోయింది.
ప్రస్తుతం రవితేజ.. శరత్ మందవ అనే దర్శకుడితో ఓ సినిమాను చేస్తున్నాడు. నాలుగు రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభం అయింది. ఈ సందర్భంగా ఓ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఇందులో రెవెన్యూ కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగిగా కనిపించాడు రవితేజ. ఈ నేపథ్యంలో ఈ మూవీలో అతడు చేసే పాత్ర గురించి ఓ న్యూస్ బయటకు వచ్చింది.

తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో ఈ మాస్ హీరో మండల రెవెన్యూ ఆఫీసర్ (ఎమ్మార్వో)గా నటిస్తున్నాడట. ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను చూసిన అతడు.. ఏకంగా ఉద్యోగాన్నే వదిలేసి వాళ్ల కోసం పోరాటం ప్రారంభిస్తాడట. ఇదే ఈ సినిమా కథ అని కూడా ప్రచారం జరుగుతోంది.
రవితేజ 68వ సినిమాగా వస్తోన్న ఇది సందేశాత్మకంగా రూపొందుతుందట. ఇందులో రవితేజ రెండు డిఫరెంట్ గెటప్‌లలో కనిపిస్తాడని అంటున్నారు. ఇక, ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇందులో దివ్యాన్షా కౌశిక్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. ఇది ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











