twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Dhamaka: మరోసారి ఊహించని పాత్రలో రవితేజ.. ధమాకాలో హైలైట్ అదేనట

    |

    క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. సుదీర్ఘ ప్రయాణం తర్వాత హీరోగా మారాడు మాస్ మహారాజా రవితేజ. లీడ్ రోల్‌లో సినిమాలు చేయడం మొదలు పెట్టిన తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను అందుకున్న అతడు.. పూర్తి స్థాయి కమర్షియల్ హీరోగా మారిపోయాడు. అంతేకాదు, మరీ ముఖ్యంగా బీ, సీ సెంటర్ల ఆడియెన్స్‌ను ఉర్రూతలూగించేలా సినిమాలు చేస్తూ మాస్ మహారాజ్ అనిపించుకున్నాడు. ఇక, చాలా కాలం పాటు పరాజయాల పరంపరతో ఇబ్బందులు పడ్డాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఏడాది ఆరంభంలో 'క్రాక్' అనే సినిమాతో మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఇది రవితేజ కెరీర్‌లోనే అత్యంత ఎక్కువ కలెక్షన్లను వసూలు చేసి బిగ్ హిట్‌గా నిలిచింది.

    Bigg Boss OTT: షోలోకి వివాదాస్పద నటి ఎంట్రీ.. పోలీస్ కేస్ తర్వాత ఊహించని విధంగా!Bigg Boss OTT: షోలోకి వివాదాస్పద నటి ఎంట్రీ.. పోలీస్ కేస్ తర్వాత ఊహించని విధంగా!

    ఈ ఉత్సాహంతోనే రవితేజ వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు లైన్‌లో పెట్టుకుంటూ వెళ్తున్నాడు. ఇలా ఇప్పటికే 'ఖిలాడి' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రమేష్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే దక్కుతోంది. దీంతో కలెక్షన్లు కూడా భారీగానే వస్తున్నాయి. ఇది విడుదల అవడంతో ఫ్యూచర్ ప్రాజెక్టులపై రవితేజ ఫుల్ ఫోకస్ పెట్టేశాడు. ఇందులో భాగంగానే ఇప్పటికే 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీతో పాటు 'రావణాసుర' చిత్రాలను పట్టాలెక్కించేశాడు. ఇప్పటికే వీటికి సంబంధించిన చాలా వరకూ షూటింగ్‌ను కూడా ఈ స్టార్ హీరో పూర్తి చేసుకున్నాడు.

    Ravi Teja Professor Role in Dhamaka Movie

    ప్రస్తుతం పట్టాలపై ఉన్న సినిమాలే కాకుండా మాస్ మహారాజా రవితేజ ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు త్రినాథరావు నక్కినతో కూడా ఓ సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే.దీనికి 'ధమాకా' అనే టైటిల్ పెట్టారు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్నారు. ఇందులో రవితేజ మార్క్ టైమింగ్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌ను కూడా చూపించబోతున్నారని అంటున్నారు. ఇక, త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా దీని గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది.

    ప్రేమికుల రోజున షాకిచ్చిన శ్రీముఖి: ఏకంగా ఆ ఫొటోతో సర్‌ప్రైజ్.. బాయ్‌ఫ్రెండ్ అతడేనా!ప్రేమికుల రోజున షాకిచ్చిన శ్రీముఖి: ఏకంగా ఆ ఫొటోతో సర్‌ప్రైజ్.. బాయ్‌ఫ్రెండ్ అతడేనా!

    ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం.. 'ధమాకా' మూవీలో మాస్ మహారాజా రవితేజ కాలేజ్ ప్రొఫెసర్ పాత్రను పోషిస్తున్నాడట. ఇందులో స్టూడెంట్ అయిన హీరోయిన్ శ్రీలీలతో అతడు ప్రేమాయణం సాగిస్తాడని తెలుస్తోంది. ఫస్టాఫ్ మొత్తం ఇదే లైన్ ఉంటుందని.. ఇది సినిమాకే హైలైట్‌గా నిలవబోతుందనే టాక్ వినిపిస్తోంది. ఇక, ఇందులో రవితేజ మరో పాత్రను కూడా చేస్తున్నాడని తెలిసింది. అయితే, అది ఏంటి అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారిపోయింది. దీంతో ఈ సినిమా ఆరంభంలోనే ఆసక్తికరంగా నిలిచిపోయింది.

    క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న 'ధమాకా' సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక, ఇందులో నటించే నటీనటుల వివరాలు చిత్ర యూనిట్ రివీల్ చేయలేదు. అయితే, 'పెళ్లిసందD' ఫేం శ్రీలీలా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నట్లు ప్రేమికుల రోజును పురస్కరించుకుని చిత్ర యూనిట్ ప్రకటించింది. అంతేకాదు, వీళ్లిద్దరూ కలిసున్న పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. ఇది చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అయిపోయింది.

    English summary
    Ravi Teja Now Doing Dhamaka Movie Under Trinadha Rao Nakkina Directions. He Will Play Professor Role in This Movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X