Ramarao On Duty: రవితేజ సంచలన నిర్ణయం.. నెల గ్యాప్‌లో రెండు సినిమాలు రిలీజ్

ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేకున్నా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. క్యారెక్టర్ ఆర్టిస్టు స్థాయి నుంచి స్టార్ హీరోగా ఎదిగిపోయాడు రవితేజ. మరీ ముఖ్యంగా తనదైన శైలి యాక్టింగ్‌తో బీ, సీ సెంటర్ల ఆడియెన్స్‌ను ఫిదా చేసేలా సినిమాలు చేస్తూ మాస్ మహారాజ్ అనే బిరుదును సొంతం చేసుకున్నాడు. ఇలా చాలా కాలంగా హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు. ఇక, చాలా కాలం పాటు పరాజయాల పరంపరతో ఇబ్బందులు పడ్డాడు.

ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఏడాది ఆరంభంలో 'క్రాక్' అనే సినిమాతో మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఇది సూపర్ హిట్ అవడంతో వరుస పెట్టి ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా రవితేజ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఆ వివరాలు మీకోసం!

క్రాక్ తర్వాత ఖిలాడీగా మారాడు

క్రాక్ తర్వాత ఖిలాడీగా మారాడు

'క్రాక్' మూవీ రిజల్ట్‌తో ఊపు మీదున్నాడు రవితేజ. ఈ జోష్‌తోనే ఆ వెంటనే రమేష్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడీ' అనే సినిమా స్టార్ట్ చేశాడు. ఇందులో మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. పెన్‌ స్టూడియోస్‌ సమర్పణలో హవీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ఇందులో రవితేజ డుయల్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే.

రామారావుగా మారిన మాస్ రాజ్

రామారావుగా మారిన మాస్ రాజ్

'ఖిలాడీ' పట్టాలపై ఉండగానే శరత్ మందవ అనే దర్శకుడితో రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' అనే సినిమాను చేస్తున్నాడు. ఇందులో దివ్యాన్షా కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో రవితేజ ప్రభుత్వ ఉద్యోగిగా నటిస్తోన్నాడు.

ఈ రెండూ కంప్లీట్ చేసేశాడుగా

ఈ రెండూ కంప్లీట్ చేసేశాడుగా

'క్రాక్' విజయం తర్వాత మాస్ మహారాజా రవితేజ ఫుల్ స్వింగ్‌లో కనిపిస్తున్నాడు. దీని తర్వాత వెంట వెంటనే సినిమాలు లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పటికే 'ఖిలాడీ', 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీల షూటింగ్‌లను ఒక్కొక్కటిగా పూర్తి చేసేశాడు. వీటికి సంబంధించిన కొంత బ్యాలెన్స్ వర్క్ మిగిలి ఉంది. అది కూడా త్వరలోనే పూర్తి చేయనున్నాడు.

రామారావు వచ్చేది అప్పుడేనట

రామారావు వచ్చేది అప్పుడేనట

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీ నుంచి అదిరిపోయే అప్‌డేట్ రాబోతుందని చిత్ర యూనిట్ ఆదివారం వెల్లడించింది. అందుకు అనుగుణంగానే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌తో కూడిన పోస్టర్‌ను విడుదల చేశారు. దీన్ని వచ్చే ఏడాది మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు అందులో ప్రకటించారు.

నెల గ్యాప్‌లోనే రెండు సినిమాలు

నెల గ్యాప్‌లోనే రెండు సినిమాలు

మాస్ మహారాజా రవితేజ వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఇప్పటికే 'ఖిలాడీ' మూవీని వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 11న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రాన్ని మార్చి 25న రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. అంటే ఒక నెల గ్యాప్‌లోనే రవితేజ నటించిన రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయట.

మరో మూడు ప్రాజెక్టులు సిద్ధంగా

మరో మూడు ప్రాజెక్టులు సిద్ధంగా

రవితేజ ఇప్పుడు ఈ రెండు చిత్రాలు మాత్రమే కాకుండా.. మరో మూడు ప్రాజెక్టులను కూడా లైన్‌లో పెట్టుకున్నాడు. అందులో త్రినాథరావు నక్కినతో 'ధమాకా' అనే సినిమా చేస్తున్నాడు. అలాగే, సుదీర్ వర్మ దర్శకత్వంలో 'రావణాసుర' అనే ప్రాజెక్టును సైతం ప్రకటించాడు. వీటితో పాటు 'టైగర్' అనే పాన్ ఇండియా ఫిల్మ్‌ను కూడా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X