Ravi Teja Ravanasura: ఫస్ట్ లుక్ తోనే సర్‌ప్రైజ్‌ ఇచ్చిన మాస్ రాజా.. నెవ్వర్ బిఫోర్ అనేలా..

వరుస పరాజయాలతో ఉన్న హీరోలు మళ్లీ బౌన్స్ బ్యాక్ కావాలి అంటే అంత ఈజీ కాదు. కష్టంతో పాటు కాస్త అదృష్టం కూడా ఉండాలి. అలాగే పరిస్థితులు కూడా అనుకూలిస్తేనే ఏ హీరో అయినా నిలదొక్కుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే రవితేజ అదృష్టం ఏమిటో గాని చుట్టూ పరిస్థితిలు అతనికి తగ్గట్టుగా లేకపోయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాడు. కరోనాతో సతమతమవుతున్న సమయంలో వచ్చిన క్రాక్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అసలు ఆ సినిమా సక్సెస్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ రవితేజ మాత్రం ఎంతో నమ్మకంతో సినిమాను పూర్తిచేసి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఆ సినిమా తర్వాత అదే తరహాలో సక్సెస్ అందుకోవాలని కథల ఎంపిక విషయంలో కూడా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు.

ఎక్కువగా కమర్షియల్ సినిమాలు చేయకుండా విభిన్నమైన ప్రయోగాలు చేసేందుకు కూడా మాస్ రాజా సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఖిలాడి సినిమాను యాక్షన్ సినిమాగా భారీ బడ్జెట్ తో రూపొందించారు. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలతో పాటు మంచి ఎమోషన్ కూడా ఉంటుందట. తప్పకుండా ఈ సినిమా కూడా సక్సెస్ అవుతుందనే రవితేజ నమ్మకంతో ఉన్నాడు. ఇక ఆ తర్వాత మరో రెండు సినిమాలు కూడా పూర్తి చేసుకునే విధంగా రవితేజ షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం సెట్స్ పై రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాతో పాటు త్రినాధరావు నక్కినతో ధమాకా అనే సినిమాలు చేస్తున్నాడు.

ఈ రెండు సినిమాలు కూడా వేటికవే భిన్నంగా రూపొందుతున్నాయి. వీలైనంతవరకూ ఈ రెండు సినిమాలను చాలా వేగంగా పూర్తి చేయాలని రవితేజ ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే సుధీర్ వర్మ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేసేందుకు ఒప్పుకున్న విషయం తెలిసిందే ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. అనుకున్నట్లుగానే 'రావణాసుర' టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు.

Ravi Teja Ravanasura intensive first look poster

రవితేజ తన సినీ జీవితంలో ఎన్నడూ కనిపించని విధంగా రావణాసుర అనే సినిమాలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఫస్ట్ లుక్ లో రవితేజ పాత్రకు సంబంధించిన లుక్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఈ సినిమాలో థ్రిల్లర్ అంశాలను మాత్రమే కాకుండా కొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీ పాయింట్ ను కూడా హైలెట్ చేయబోతున్నట్లు సమాచారం. రవితేజ లైనప్ లో కేవలం ఈ నాలుగు సినిమాలు మాత్రమే కాకుండా ఒక పాన్ ఇండియా సినిమా కూడా చేయబోతున్నట్లు క్లారిటీ వచ్చేసింది. రావణాసుర సినిమాతో పాటు రవితేజ మొదటి సారి ఒక బయోపిక్ సినిమాలో కూడా నటిస్తున్నాడు.

స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న టైగర్ సినిమాపై ఇటీవల అఫీషియల్గా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమాను పాన్ ఇండియా మార్కెట్ కు తగ్గట్టుగా రూపొందిస్తున్నారు. వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే మొదలు కానుంది. అయితే మరొక వైపు ఇదే బయోపిక్ ను బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా చేస్తున్నాడు. మరి ఈ రెండు సినిమాలలో మొదట ఏ సినిమా ప్రేక్షకుల ముందుగా వస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X