Ravi Teja: పవన్ దర్శకుడితో రవితేజ రీమేక్ మూవీ.. ఎన్నడూ చేయని పాత్రలో మాస్ మహారాజా

వరుస పెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు మాస్ మహారాజా రవితేజ. గతేడాది ధమాకాతో డబుల్ ట్రీట్ ఇచ్చిన రవితేజ 2023లో మెగాస్టార్ చిరంజీవితో కలిసి వాల్తేరు వీరయ్యలో సందడి చేశాడు. మళ్లీ అతి తక్కువ సమయంలోనే రావణాసుర మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెద్దగా హిట్ కొట్టలేకపోయాడు.

ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు సినిమాతో బిజీగా ఉన్న రవితేజ అప్పుడే మరో సినిమాను లైన్ లో పెట్టాడు. అది కూడా హిందీలో సూపర్ హిట్ అయిన చిత్రాన్ని రీమేక్ గా తెలుగులోకి తీసుకొస్తున్నారు. మరి ఆ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

Ravi Teja Remake Movie With Harish Shankar Is Ajay Devgn Raid

హిట్ల తర్వాత: ధమాకా, వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత మాస్ మహారాజా రవితేజ ప్లాప్ అందుకున్న మూవీ రావణాసుర. డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కానీ, ఓటీటీలో మాత్రం మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు రవితేజ మరోసారి మంచి హిట్ కొట్టేందుకు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Ravi Teja Remake Movie With Harish Shankar Is Ajay Devgn Raid

అక్టోబర్ 20న: మాస్ మహారాజ రవితేజ తాజాగా నటిస్తున్న చిత్రం 'టైగర్ నాగేశ్వరరావు' (Tiger Nageswara Rao). వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రంగా వస్తున్న 'టైగర్ నాగేశ్వరరావు'పై భారీ అంచనాలే నెలకొన్నాయి. దానికి తగినట్లుగానే సినిమా మేకింగ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 20న ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు.

Ravi Teja Remake Movie With Harish Shankar Is Ajay Devgn Raid

బాలీవుడ్ హిట్ మూవీ: 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే మొదలు కాగా ఇటీవల ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. దానికి బీభత్సమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా పూర్తి కాకముందే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రవితేజ. అది కూడా రీమెక్ మూవీకి. బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవగన్ నటించి సూపర్ హిట్ కొట్టిన 'రైడ్' (Raid Movie) సినిమాను తెలుగులో రవితేజ రీమేక్ చేయనున్నాడని టాక్.

Ravi Teja Remake Movie With Harish Shankar Is Ajay Devgn Raid

పవన్ డైరెక్టర్: ఇప్పటికే గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమాను లాంఛనంగా ప్రారంభించిన రవితేజ అప్పుడే మరో రీమేక్ మూవీకి పచ్చ జెండా ఊపడం హాట్ టాపిక్ అవుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. గోపీచంద్ సినిమా తర్వాత ఈ రీమేక్ ను పట్టాలెక్కిస్తారని సమాచారం.

Ravi Teja Remake Movie With Harish Shankar Is Ajay Devgn Raid

వచ్చే ఏడాది: ఇక ఈ హిందీ రీమేక్ మూవీలో రవితేజ ఎన్నడూ చేయని ఇన్‌కమ్‌టాక్స్‌ ఆఫీసర్ పాత్ర చేయునున్నాడు. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే రవితేజ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో షాక్, మిరపకాయ్ వంటి సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X