twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మళ్ళీ రెమ్యునరేషన్ డోస్ పెంచిన రవితేజ.. ఆ కండిషన్‌కు ఒప్పుకోలేక అడిగినంత ఇచ్చేస్తున్నారు

    |

    సంక్రాంతి సీజన్ టాలీవుడ్ బాక్సాఫీస్ కు బూస్ట్ బాగానే ఇచ్చింది. ఈ ఏడాది గడవడమే కష్టమని అనుకున్న సినీ నిర్మాతలకు సంక్రాంతి కలెక్షన్స్ వలన కొంత ధైర్యం వచ్చిందనే చెప్పాలి. ఇక మాస్ మహారాజా రవితేజ అయితే మొత్తానికి 2021 సంక్రాంతి విన్నర్ గా నిలిచాడు. క్రాక్ బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో లాభాలను అందించాడు. ఇక అతను రెమ్యునరేషన్ డోస్ కూడా పెంచినట్లు సమాచారం.

    పూనమ్ భజ్వా కొత్త లుక్ మాములుగా లేదు (ఫొటోలు)

    50కోట్లకు పైగా..

    50కోట్లకు పైగా..

    క్రాక్ సినిమా పక్కా మాస్ కమర్షియల్ కావడంతో మొదటిరోజు అభిమానుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. విడుదల ఆలస్యం అయినప్పటికీ ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికి ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన క్రాక్ మొదటి రోజు కేవలం రెండు షోలతోనే హై రేంజ్ లో కలెక్షన్స్ అందుకుంది. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద 50కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది.

    అప్పటివరకు 7కోట్లే..

    అప్పటివరకు 7కోట్లే..

    ఒక విధంగా క్రాక్ సినిమా రబితేజ కెరీర్ కు మరో లైఫ్ ఇచ్చిందనే చెప్పాలి. రవితేజ పనైపోయింది. ఇక సినిమాలు చేయడం కష్టమే అనే కామెంట్స్ వచ్చాయి. ఎందుకంటే మాస్ రాజా గత సినిమాలు కూడా డిజాస్టర్ అయ్యాయి. మాస్ రాజా చివరగా రాజా ది గ్రేట్ సినిమాతో హిట్ కొట్టిన విషయం తెలిసిందే. అప్పటివరకు కూడా 7కోట్ల నుంచి 8కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకున్నాడు.

    అప్పుడు రెమ్యునరేషన్ బాగా తగ్గింది

    అప్పుడు రెమ్యునరేషన్ బాగా తగ్గింది

    రాజా ది గ్రేట్ అనంతరం టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు, అమర్ అక్బర్ ఆంటోనీ, డిస్కో రాజా వంటి సినిమాలు ఏ రేంజ్ లో ప్లాప్ అయ్యాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మార్కెట్ ఒక్కసారిగా పడిపోయింది. సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ ఒకప్పుడు 30కోట్ల వరకు ఉంటే.. ఆ తరువాత 18కోట్లకు వచ్చేసింది. దీంతో రెమ్యునరేషన్ భారీగా తగ్గింది.

    ఆ ట్రిక్కుతో 11కోట్లు..

    ఆ ట్రిక్కుతో 11కోట్లు..

    నిర్మాతలను కూడా రిస్క్ పెట్టలేక మాస్ రాజా ఓ వర్గం హీరోల రూల్ ను ఫాలో అయ్యాడు. రెమ్యునరేషన్ తీసుకోకుండా నైజాం ఏరియా హక్కులను తీసుకొని అక్కడ వచ్చిన షేర్స్ మొత్తం తనకే అనేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో క్రాక్ సినిమా 17రోజుల్లో 11కోట్లకు పైగా షేర్స్ ను అందించింది. ఒకవేళ రెమ్యునరేషన్ ఇచ్చి ఉంటే కేవలం 5కోట్ల వరకే వచ్చి ఉండేవి.

    ఇప్పుడు ఎంత అడుగుతున్నాడంటే..

    ఇప్పుడు ఎంత అడుగుతున్నాడంటే..

    మాస్ రాజా సినిమా మీద నమ్మకంతో నైజాం హక్కులను మాట్లాడుకోవడం బాగా కలిసొచ్చింది. అంటే రానున్న రోజుల్లో దాదాపు 12కోట్ల నుంచి 13కోట్ల వరకు చేతుల్లోకి వచ్చేస్తాయి. ఇక ఇప్పుడు క్రాక్ హిట్టుతో మాస్ రాజా రెమ్యునరేషన్ డోస్ పెంచినట్లు సమాచారం. కొత్త ప్రాజెక్టులకు 12 నుంచి 13కోట్ల వరకు అడుగుతున్నట్లు సమాచారం.

    అందుకే అడిగినంత ఇచ్చేస్తున్నారు..

    అందుకే అడిగినంత ఇచ్చేస్తున్నారు..

    అసలైతే రవితేజ నెక్స్ట్ సినిమాలకు కూడా నైజాం హక్కులను ఇవ్వమని అడిగితే ఎవరు ఇవ్వడం లేదట. ఎందుకంటే కరోనా కాలంలో కేవలం 50% ఆక్యుపెన్సీతోనే ఆ రేంజ్ లో కలెక్షన్స్ వచ్చాయి అంటే.. ఇక నార్మల్ డేస్ లోకి వచ్చిన తరువాత థియేటర్స్ హౌజ్ ఫుల్ అయితే లెక్కలు ఇంకా ఏ రేంజ్ లో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. అందుకే రవితేజకు అడిగినంత ఇచ్చేస్తున్నట్లు సమాచారం.

    Recommended Video

    Ravi Teja : Actor Who Redefined Hardwork After Megastar Chiranjeevi | Filmibeat Telugu

    English summary
    Mass Maharaja Ravi Teja has created a new record called Crack Never Before throughout his career. Ravi Teja has once again proved his mettle by dusting off the box office. Crack, directed by Gopichand Malineni, has attracted audiences from all walks of life as a commercial. Not only did it receive good openings at the box office on the first day but it continued the next day as well.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X