Don't Miss!
- Sports
INDvsAUS : భారత్‌తో టెస్టు సిరీస్ ముందు.. బెంగళూరులో ఆస్ట్రేలియా జట్టు ప్రాక్టీస్ సెషన్స్
- News
హైదరాబాద్‌లో మరో దిగ్గజ సంస్థ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్: 1800 మందికి ఉపాధి
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Lifestyle
ఈ రాశుల వారు భగ్నప్రేమికులు, అలా పడిపోతారు ఇలా విడిపోతారు
- Finance
Adani Enterprises FPO: అనుకున్నది సాధించిన అదానీ.. మూడో రోజు మ్యాజిక్.. ఏమైందంటే..
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
వాల్తేరు వీరయ్యలో రవితేజ రోల్ లీక్: అందులో చిరంజీవినే మించేలా!
తెలుగు సినీ ఇండస్ట్రీలో దాదాపు నలభై ఏళ్లుగా హవాను చూపిస్తూ స్టార్‌గా వెలుగొందుతోన్నారు మెగాస్టార్ చిరంజీవి. మధ్యలో కొంత కాలం గ్యాప్ ఇచ్చినా.. 'ఖైదీ నెంబర్ 150' మూవీతో సినీ రంగంలోకి రీఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూడకుండా వరుస సినిమాలతో దూసుకుపోతోన్నారు. ఇలా ఇప్పటికే పలు చిత్రాలతో ఈ మెగా హీరో ప్రేక్షకులను అలరించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' అనే సినిమాను చేస్తున్నారు. మాస్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
బీచ్‌లో యాంకర్ హరితేజ హాట్ షో: అలాంటి డ్రెస్‌లో తొలిసారి అరాచకంగా!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 154వ సినిమాగా 'వాల్తేరు వీరయ్య'ను చేస్తోన్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర రూపొందిస్తోన్న ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కూడా కీలక పాత్రను చేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ దాదాపుగా పూర్తైపోయింది. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన పాటల చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్ ఫారెన్ వెళ్లి అవి కూడా పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాను నుంచి ఓ అదిరిపోయే న్యూస్ ఒకటి ఫిల్మ్ నగర్ ఏరియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.

ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'వాల్తేరు వీరయ్య' మూవీలో రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్రను చేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన టీజర్‌ను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. తాజా సమాచారం ప్రకారం.. ఇందులో మాస్ మహారాజా పాత్ర 50 నిమిషాలు మాత్రమే ఉంటుందట. కానీ, ఆ ఉన్నంత సేపు మాత్రం ప్రేక్షకులకు ఊరమాస్ ట్రీట్ ఉండేలా ప్లాన్ చేశారట. ముఖ్యంగా రవితేజకు చిరంజీవి కంటే హై రేంజ్ ఎలివేషన్స్ సీన్స్ ఉంటాయని తెలిసింది. ఇక, వీళ్లిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు పూనకాలు తెప్పించేలా డిజైన్ చేశారనే టాక్ వినిపిస్తోంది.
స్పోర్ట్స్ బ్రాతో అనుష్క ఓవర్ డోస్ షో: షార్ట్ కూడా పైకి లేపేసి మరీ!
చిరంజీవి, రవితేజ కాంబోలో బాబీ రూపొందిస్తోన్న 'వాల్తేరు వీరయ్య' మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచలి రవి శంకర్ నిర్మిస్తున్నారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 13వ తేదీన రిలీజ్ కానుంది.