రవితేజతో క్రాక్.. అధికారికంగా ప్రకటించారు
మాస్ మాహారాజా రవితేజ హీరోగా కమర్షియల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీగా కొత్త సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. రవితేజ కెరీర్‌లో ఇది 66వ సినిమాగా రూపుదిద్దుకోనుంది. తాజాగా ఈ సినిమాకు క్రేజీ టైటిల్ ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు యూనిట్ సభ్యులు.
'క్రాక్' అనే క్యాచీ టైటిల్ ఫిక్స్ చేసి కొత్త పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే గతంలో రవితేజతో డాన్ శీను, బలుపు లాంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన గోపీచంద్ మలినేని మరో హిట్ సినిమా లైన్ లో పెట్టారని తెలుస్తోంది. ఈ రోజే (నవంబర్ 14) ఈ సినిమా అధికారికంగా ప్రారంభం కానుంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రానున్న ఈ సినిమాని 2020 సమ్మర్‌లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

ఇక ఈ డిఫెరెంట్ మూవీలో రవితేజ సరసన శృతి హాసన్‌ని హీరోయిన్‌గా తీసుకున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా కీలక పాత్రలో నటించనుంది. చిత్రంలో రవితేజ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించనున్నాడు. సరస్వతి ఫిలిం డివిజన్ బ్యానర్‌లో బీ మధు నిర్మిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు.
'క్రాక్' చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్. ఇక ప్రస్తుతం వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'డిస్కో రాజా' సినిమాతో బిజీగా ఉన్నాడు రవితేజ. డిసెంబర్ నెలలో ఈ సినిమా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











