Ravi Teja 68 క్రేజీ టైటిల్‌తో.. రామారావు On Duty ఫస్ట్‌లుక్ రిలీజ్

మాస్ మహారాజా రవితేజ తన కెరీర్‌ను పరుగులు పెట్టిస్తున్నారు. రవితేజ్ కెరీర్ ముగిసిందని భావించిన విమర్శకులకు సరైన సమాధానం చెబుతూ లాక్‌డౌన్ తర్వాత క్రాక్ రూపంలో ఇండస్ట్రీకి భారీ హిట్ అందించారు. క్రాక్‌ విజయం తర్వాత విభిన్నమైన కథలను ఎంపిక చేసుకొంటూ తన ప్రస్థానాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. తన కెరీర్‌లో 68వ చిత్రంగా రానున్న రామారావు On Duty టైటిల్ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు.

రామారావు On Duty ఫస్ట్‌లుక్‌లో మాస్ మహారాజ్ మరోసారి మాస్ లుక్‌లో కనిపించేందుకు ప్రయత్నించినట్టు స్పష్టమైంది. క్రాక్ తరహాలోనే మళ్లీ అవినీతిపై శంఖారావం పూరించేందుకు సిద్దమైనట్టు కనిపించింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజైన కొద్ది సేపట్లోనే సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌గా మారింది. ఈ చిత్రానికి శరత్ మండవ దర్శకత్వం వహిస్తుండగా, సుధాకర్ చెరుకూరి నిర్మించారు.

 Ravi Tejas 68th movie first look Release: Title Rama Rao On Duty is tredning

రామారావు On Duty చిత్రంలో మజిలీ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇతర నటీనటులు వివరాలు త్వరలోనే ప్రకటిస్తారు.

నటీనటులు: రవితేజ, దివ్యాంశ కౌశిక్ తదితరులు
దర్శకత్వం: శరత్ మండవ
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
మ్యూజిక్: శ్యామ్ సీఎస్
సినిమాటోగ్రఫి: సత్యన్ సూర్యన్
ఎడిటింగ్: ప్రవీణ్ కేఎల్
బ్యానర్: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్
రిలీజ్ డేట్: 2021-11-15

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X