రవితేజ ఇంటి నుంచి యువ హీరో ఎంట్రీ.. ఫస్ట్ లుక్ పోస్టర్ లోనే రొమాంటిక్ గా..
ఎలాంటి సపోర్ట్ లేకుండా ఒంటరిగా ఇండస్ట్రీలో తనకంటూ ఒక మాస్ ఇమేజ్ ను సంపాదించుకున్న అతి తక్కువ మంది హీరోల్లో రవితేజ టాప్ లిస్టులో ఉంటారు అని చెప్పవచ్చు. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి సైడ్ హీరోగా మారి ఆ తర్వాత మెయిన్ హీరో వరకు వచ్చిన రవితేజ ఎంతగా హార్డ్ వర్క్ చేసాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే నెగిటివ్ ఫ్యాన్స్ కూడా లేకుండానే అతను మంచి సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక అతని ఇంటి నుంచి త్వరలోనే యువ హీరోలు ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు.
రవితేజ కొడుకు మహాధన్ ఇదివరకే రాజా ది గ్రేట్ సినిమాలో చిన్నప్పటి రవితేజ పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ఇక అతను కూడా కాలేజ్ పూర్తి చేసిన తర్వాత సినిమాల్లో హీరోగా పరిచయం అవుతాడు అని తెలుస్తోంది. ఇక ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ సోదరుడు రఘు తనయుడు మాధవ్ భూపతి రాజు టాలీవుడ్‌లో అరంగేట్రం చేయబోతున్నాడు. అతను ప్రేమకథతో హీరోగా పరిచయం అవుతున్నాడు.

భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్‌పై నల్లమలుపు బుజ్జి ఆ సినిమాను నిర్మించనున్నారు. ఇక సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. "ఏ పిల్లా" అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. వింటేజ్ లవ్ డ్రామాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మిస్ ఇండియా రన్నరప్ రూబెన్ షెకావత్ ఈ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టింది.
ఇక ప్రముఖ దర్శకుడు రమేష్ వర్మ కథ అందించగా, నూతన దర్శకుడు లుధీర్ బైరెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కథ 90 ల కాలానికి దగ్గరగా ఉంటుందట. ఏయ్ పిల్లా ప్రాజెక్ట్ కోసం టాప్ టెక్నీషియన్‌లను నియమించారు. ఇక సెప్టెంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మిక్కీ జె మేయర్ సంగీతం సమకూరుస్తుండగా, శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మరి ఈ సినిమాతో మాధవ్ ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి.


Click it and Unblock the Notifications











