డిస్కో రాజా 2.0 టీజర్: చించేసిన రవితేజ.. వయసు కాదు, భయం గుర్తుకురావాలి

గత కొంతకాలంగా సరైన హిట్ లేక కాస్త డీలాపడిన మాస్ మహారాజ్ రవితేజ.. ఆ జ్ఞాపకాలన్నీ చెరిపేసేలా రంగంలోకి దిగుతున్నాడు. ఎలాగైనా బ్లాక్‌బస్టర్ సాధించాలనే కసితో వీఐ ఆనంద్ దర్శకత్వంలో 'డిస్కోరాజా' సినిమా చేస్తున్న ఈ హీరో ఈ సినిమాలో డిఫెరెంట్ క్యారెక్టర్ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుండి 2.0 టీజర్ విడుదలైంది. అయితే ఈ టీజర్ ఎలా ఉంది? రవితేజకు హిట్ ఖాయమేనా? వివరాల్లోకి పోతే..

డిస్కో రాజా ఫస్ట్ టీజర్.. రెస్పాన్స్

డిస్కో రాజా ఫస్ట్ టీజర్.. రెస్పాన్స్

రవితేజ అభిమానుల టేస్ట్‌కి సరిపోయేలా ఈ సినిమాను తెరకెక్కించారు వీఐ ఆనంద్. ఇప్పటికే విడుదలైన డిస్కో రాజా ఫస్ట్ టీజర్ సినిమా ఎలా ఉంటుందనేది, రవితేజ రోల్ ఎంత డిఫెరెంట్‌గా ఉంటుందనేది ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఈ టీజర్‌కి మంచి రెస్పాన్స్ రావడంతో తాజా మరో టీజర్ విడుదల చేసి ప్రేక్షక లోకాన్ని అట్రాక్ట్ చేసింది డిస్కో రాజా టీమ్.

విలన్ క్యారెక్టర్ పవర్‌ఫుల్.. సెకండ్ టీజర్

విలన్ క్యారెక్టర్ పవర్‌ఫుల్.. సెకండ్ టీజర్

ఒక నిమిషం 6 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ రెండో టీజర్‌లో విలన్ పాత్రపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. చిత్రంలో విలన్ పాత్ర పేరు సేతు. ఇప్పటిదాకా తమిళ సినిమాల్లో విలన్‌గా నటించిన తెలుగు నటుడు బాబీ సింహా.. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించబోతున్నాడు. ఈయన చేసిన ఈ విలన్ క్యారెక్టర్ ఎంత పవర్‌ఫుల్ అనేది ఈ రెండో టీజర్ చెప్పేసింది.

చివర్లో రవితేజ ఎంట్రీ.. ఫైట్ అండ్ డాన్స్ సీన్స్

చివర్లో రవితేజ ఎంట్రీ.. ఫైట్ అండ్ డాన్స్ సీన్స్

‘సేతు అంటే గుర్తుకు రావాల్సింది వయసు కాదు, భయం గుర్తుకురావాలి' అంటూ బాబీ సింహా చెప్పే డైలాగ్ ఈ రెండో టీజర్‌లో హైలైట్‌‌గా నిలుస్తోంది. ఇక టీజర్ చివర్లో రవితేజ ఎంట్రీ చూపించి.. ఆయన ఫైట్ అండ్ డాన్స్ సీన్లతో మాస్ మహారాజ్ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు డిస్కో రాజా యూనిట్ సభ్యులు.

ఐ లవ్ ఫ్రీకింగ్ ఫియర్ ఇన్ యువర్ ఐస్

ఐ లవ్ ఫ్రీకింగ్ ఫియర్ ఇన్ యువర్ ఐస్

హెడ్ ఫోన్స్ పెట్టుకుని మ్యూజిక్‌కి డ్యాన్స్ చేస్తూ ‘ఎనీవన్ ఎల్స్.. వాన్నా డ్యాన్స్ విత్ మి?' అని రవితేజ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. చివరగా గన్‌తో విలన్‌ను కాల్చుతూ ‘‘ఐ లవ్ ఫ్రీకింగ్ ఫియర్ ఇన్ యువర్ ఐస్'' అని రవితేజ చెప్పే డైలాగ్‌తో టీజర్ ముగిసింది. మొత్తానికి ఈ టీజర్ ద్వారా సినిమాపై అంచానాలు పెరిగాయని చెప్పుకోవచ్చు.

Recommended Video

Ravi Teja's Disco Raja Sankranthi Special Interview Promo

డిస్కో రాజా మూవీ

డిస్కో రాజా చిత్రంలో రవితేజ రెండు డిఫెరెంట్ షేడ్స్‌లో కనిపించనున్నాడు. వృద్దుడిగా, యువకుడిగా రవితేజ నటన అబ్బురపరచనుందని తెలుస్తోంది. పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్య హోప్ హీరోయిన్లుగా నటించారు. వెన్నెల కిషోర్, సత్య ముఖ్యపాత్రలు పోషించారు. ఎస్‌ఆర్టీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రజిని తాళ్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జనవరి 24న 'డిస్కో రాజా' విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X