వినాయక చవితి కానుక: రవితేజ నుంచి ఊహించని సర్‌ఫ్రైజ్

స్వయంకృషితో తెలుగు సినీ ఇండస్ట్రీకి వచ్చాడు మాస్ మహారాజా రవితేజ. కెరీర్ ఆరంభంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాలు చేసి.. ఆ తర్వాత హీరోగా నిలదొక్కుకున్నాడు. ఈ క్రమంలోనే హిట్ చిత్రాలతో స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ఐదు పదుల వయసులోనే ఎంతో ఎనర్జీతో కనిపిస్తూ.. కుర్ర హీరోలకు పోటీగా నిలుస్తున్నాడు. ఏడాదికి రెండు సినిమాలైనా చేసే రవితేజ.. ఈ మధ్య కొంచెం స్పీడు తగ్గించాడు. ప్రస్తుతం అతడు ఒకే ఒక్క సినిమాను చేస్తున్నాడు. అదే 'డిస్కోరాజా'.

రవితేజ ప్రస్తుతం 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' ఫేమ్ వీఐ ఆనంద్ దర్శకత్వంలో 'డిస్కోరాజా' అనే సినిమా చేస్తున్నాడు. కొద్దిరోజులుగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఎస్‌‌ఆర్‌‌టీ ఎంటర్‌టైన్మెంట్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్, నభ నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్‌ఎస్‌ తమన్‌ స్వరకర్త. వెన్నెల కిషోర్, సునీల్‌ ప్రధాన పాత్రలో నటించనున్న ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ బ్యాగ్ డ్రాప్‌తో రానుంది. దీంతో ఈ సినిమాపై రవితేజ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులపై ఎన్నో అంచనాలు ఉన్నాయి.

ఇటీవల 'డిస్కోరాజా' సినిమా ప్రీ లుక్ విడుదలైంది. దీనికి మంచి స్పందన వచ్చింది. ఇక, తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. వినాయక చవితి సందర్భంగా చిత్ర యూనిట్ డిస్కోరాజా ఫస్ట్ లుక్ విడుదల చేసింది. ఇందులో ఇందులో ఓ చేతిలో గన్, మరో చేతిలో సిగరెట్ పట్టుకుని డాన్ పోజ్ ఇస్తున్నాడు మాస్ మహారాజా రవితేజ. అంతేకాదు, అతడు కూర్చున్న కుర్చీలో ఓ ల్యాండ్ లైన్ ఫోన్ కూడా ఉంది. ఇవన్నీ గోల్డ్ కలర్‌లో ఉన్నాయి. దీంతో ఈ లుక్‌ సస్పెన్స్‌ను రేకెత్తిస్తోంది.

Ravi Tejas Disco Raja First Look Released

ఈ లుక్‌ను షేర్ చేసిన రవితేజ తన ట్విట్టర్‌లో 'డిస్కో కోసం రెడీగా ఉండండి' అని క్యాప్షన్ కూడా ఇచ్చాడు. దీన్ని ఇప్పటికే వెన్నెల కిశోర్, గోపీచంద్ మలినేని సహా ఎందరో సినీ ప్రముఖులు షేర్ చేశారు. దీంతో ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X