Just In
- 5 hrs ago
యంగ్ హీరోయిన్‌కు పెళ్లి.. మా ఆయన గొప్ప ప్రేమికుడంటూ పోస్ట్
- 6 hrs ago
గొల్లపూడి మరణం : ఆయన రాసిన ఆ నాటిక ఇష్టం.. సినీ పరిశ్రమకు తీరని లోటు.. కోట శ్రీనివాస్ కామెంట్స్
- 6 hrs ago
గొల్లపూడి మరణం : మాది గురుశిష్యుల సంబంధం.. ఆయన ద్వారానే ఆ అవకాశం.. చిరంజీవి స్పందన
- 7 hrs ago
‘సైరా’ సంచలనం: రికార్డ్ క్రియేట్ చేసిన చిరంజీవి సినిమా.. టాలీవుడ్లో ఫస్ట్ మూవీ ఇదే.!
Don't Miss!
- News
జర్మనీ యూనివర్శిటీలో కేరళ విద్యార్థిని: అనుమానస్పద స్థితిలో..చివరి ఫోన్ కాల్.. !
- Finance
నవంబర్ నెలలో 3 ఏళ్ల గరిష్టానికి రిటైల్ ద్రవ్యోల్భణం
- Technology
రెడ్మి కె30 4జీ vs రెడ్మి కె20, ఫీచర్లపై ఓ లుక్కేయండి
- Automobiles
2019 లో 10 టాప్ మోస్ట్ గూగిల్డ్ కార్స్
- Lifestyle
ఓ అందమైన వెన్నెల పున్నమి రాత్రి వేళ ఆమె గురించే ఆలోచిస్తున్న అతనికి ఓ అద్భుతం జరిగింది... అదేంటంటే..
- Sports
లాలిగా బ్రాండ్ అంబాసిడర్‌గా రోహిత్: తొలి నాన్ పుట్బాలర్గా అరుదైన ఘనత
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
కుమ్మేయడానికి సిద్దమైన మాస్ మహారాజ్.. ఇక రవితేజ దూకుడు ఆగదేమో!
ఈ మధ్యకాలంలో సరైన హిట్ లేక డీలా పడ్డాడు హీరో రవితేజ. దీంతో ఈ సారి ఎలాగైనా బ్లాక్‌బస్టర్ సాధించాలనే కసితో వీఐ ఆనంద్ దర్శకత్వంలో డిస్కోరాజా సినిమా చేస్తున్నాడు. ఎస్.ఆర్.టి. ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రామ్ తాళ్లూరి నిర్మాతగా వ్యవహరిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. రవితేజ అభిమానుల టేస్ట్‌కి సరిపోయేలా ఈ సినిమా రూపొందిస్తున్నారని తెలిసింది.
ఈ మేరకు డిస్కో రాజా షూటింగ్ చేస్తూనే ప్రేక్షకుల్లో ఆసక్తి నింపేలా అప్డేట్స్ రిలీజ్ చేస్తూ వచ్చింది చిత్రయూనిట్. ఈ క్రమంలోనే చిత్రంలోని మొదటి పాటకు ముహూర్తం ఫిక్స్ చేశారు. 'నువ్వు నాతో ఏమన్నావో' అంటూ సాగే ఈ పాటను అక్టోబర్ 19వ తేదీ సాయంత్రం 7 గంటలకు విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ పాటతోనే కుమ్మేయడానికి రెడీ అంటున్నాడట రవితేజ. ఈ పాట మొదలుకొని ఇకపై వచ్చే డిస్కో రాజా అప్డేట్స్ అన్నీ అదిరిపోనున్నాయని తెలుస్తోంది. అంటే డిస్కో రాజా దూకుడు మొదలు కానుందన్నమాట.

సైన్స్ ఫిక్షన్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న డిస్కో రాజా సినిమాలో రవితేజ సరసన నభా నటేష్, పాయల్ రాజ్‌పుత్, ప్రియాంక జవల్కర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్, సత్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. డిసెంబర్ 20 తేదీన ఈ సినిమా విడుదల కానుంది. చిత్రంలో రవితేజ రెండు డిఫెరెంట్ షేడ్స్‌లో కనిపించనున్నాడు. వృద్దుడిగా, యువకుడిగా రవితేజ నటన అబ్బురపరచనుందని తెలుస్తోంది. ఈ సినిమాతోనైనా రవితేజ తిరిగి ట్రాక్ ఎక్కుతాడేమో అని ఆశగా ఎదురు చూస్తున్నారు మాస్ మహారాజ్ ఫ్యాన్స్.