డిస్కో రాజా ఇండిపెండెన్స్ డే ట్రీట్.. ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్
ఇటీవలే అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాతో డిసాస్టర్ ఖాతాలో వేసుకున్న రవితేజ.. ఈ సారి ఎలాగైనా బ్లాక్ బస్టర్ సాధించాలనే కసితో వీఐ ఆనంద్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా డిస్కోరాజా టైటిల్ కన్ఫర్మ్ చేశారు. చిత్రానికి రామ్ తాళ్లూరి నిర్మాతగా వ్యవహరిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. చిత్రంలో రవితేజ సరసన నభా నటేష్, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సునీల్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టైటిల్ లుక్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకుంది.
కాగా తాజాగా స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా డిస్కో రాజా పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ హీరో రవితేజ ఫ్రంట్ లుక్ కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. ఈ పోస్టర్ ని ట్విట్టర్ వేదికగా పంచుకున్న రవితేజ.. ''ప్రతి ఒక్క దేశభక్తుడు, అమరుల త్యాగాలను మనం స్మరించుకోవాలి. స్వాతంత్య్రం రావడానికి ఆ రియల్ హీరోల పోరాటాలే కారణం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే'' అని తెలుపుతూ అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు.

ఈ చిత్రంలో మహారాజ్ రవితేజ సరికొత్త లుక్ లో అలరించనున్నాడు. ఇందు కోసం వీరోచితంగా కష్టపడుతున్నాడు రవితేజ. జిమ్ములో వర్కవుట్స్ చేస్తూ బాగా శ్రమిస్తున్నాడు. రవితేజ పాట్లు చూస్తుంటే డిస్కో రాజా మూవీ బాక్స్‌ఆఫీస్ దుమ్ము దులపడం ఖాయంగా అనిపిస్తోంది. మరో ఆసక్తికర విషయమేమిటంటే ఈ సినిమాలో రవితేజ రెండు డిఫెరెంట్ షేడ్స్‌లో కనిపించనున్నాడు. వృద్దుడిగా, యువకుడిగా రవితేజ దర్శనమీయనున్నాడట.


Click it and Unblock the Notifications











