ఇక రంగంలోకి దిగుతున్న 'డిస్కో రాజా'.. ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్
మాస్ మహారాజ్ రవితేజ ఇక డిస్కో రాజా రూపంలో రంగంలోకి దిగేందుకు రెడీ అయ్యాడు. గత కొంతకాలంగా సరైన హిట్ పడక సతమతమౌతున్న ఆయన ఈ సారి ఎలాగైనా బ్లాక్‌బస్టర్ సాధించాలనే కసితో ఉన్నాడు. ఈ మేరకు వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా 'డిస్కోరాజా'లో దుమ్ముదులిపే పర్ఫార్మెన్స్ చేశారని తెలుస్తోంది.
ఎస్ఆర్‌టి ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రామ్ తాళ్లూరి నిర్మాతగా వ్యవహరిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. రవితేజ అభిమానుల టేస్ట్‌కి సరిపోయేలా ఈ సినిమా తెరకెక్కుతోంది. చిత్రంలో రవితేజ సరసన ముగ్గురు అందాల భామలు నభా నటేశ్, పాయల్ రాజ్ పుత్, తాన్యా హోప్ నటించారు. శరవేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా జనవరి 24న విడుదలకు సిద్ధమైంది.

ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ చేసేందుకు సన్నద్ధమవుతున్న చిత్రయూనిట్ డిస్కో రాజా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ చేసింది. జనవరి 18వ తేదీన ఈ వేడుకను నిర్వహించబోతున్నట్లు పేర్కొంటూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఈ వేడుకకి వేదిక ఎక్కడనే విషయం మాత్రం బయటపెట్టలేదు. అతి త్వరలో ఈ వివరాలను తెలియజేయనున్నారు.

సైన్స్ ఫిక్షన్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్, సత్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. రవితేజ రెండు డిఫెరెంట్ షేడ్స్‌లో కనిపించనున్నాడు. వృద్దుడిగా, యువకుడిగా రవితేజ నటన అబ్బుర పరచనుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











