డిస్కో రాజా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్: వేదిక ఎక్కడంటే!
మాస్ మహారాజ్ రవితేజ తాజా సినిమా 'డిస్కో రాజా'. గత కొంతకాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా జనవరి 24న విడుదలకు సిద్ధమైంది. ఈ మేరకు ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేసిన చిత్రయూనిట్ తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ వివరాలు తెలిపింది.
జనవరి 19 వ తేదీన హైదరాబాద్ ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో సాయంత్రం 6 గంటల నుంచి ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుందని తెలిపారు. ఎస్.ఆర్.టి. ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రామ్ తాళ్లూరి నిర్మాతగా వ్యవహరిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. రవితేజ అభిమానుల టేస్ట్‌కి సరిపోయేలా ఈ సినిమా రూపొందించారు.

డిస్కో రాజా షూటింగ్ చేస్తూనే ప్రేక్షకుల్లో ఆసక్తి నింపేలా అప్‌డేట్స్ రిలీజ్ చేస్తూ వచ్చింది చిత్రయూనిట్. ఈ క్రమంలోనే విడుదలైన మొదటి పాట 'నువ్వు నాతో ఏమన్నావో' మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. సైన్స్ ఫిక్షన్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న డిస్కో రాజా సినిమాలో రవితేజ సరసన నభా నటేష్, పాయల్ రాజ్‌పుత్, ప్రియాంక జవల్కర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్, సత్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిత్రంలో రవితేజ రెండు డిఫెరెంట్ షేడ్స్‌లో కనిపించనున్నాడు. వృద్దుడిగా, యువకుడిగా రవితేజ నటన అబ్బురపరచనుందని తెలుస్తోంది. ఫైనల్‌గా జనవరి 24 నుంచి మాస్ మహారాజ్ హంగామా షురూ కానుంది.


Click it and Unblock the Notifications











