మార్క్ చేసుకోండి అంటూ మాస్ మహారాజ్.. డిస్కో రాజా రిలీజ్ డేట్ ఫిక్స్
మాస్ మహారాజ్ రవితేజ మరో సినిమాతో రంగం లోకి దిగుతున్నాడు. గత కొంతకాలంగా సరైన హిట్ పడక సతమతమౌతున్న ఆయన ఈ సారి ఎలాగైనా బ్లాక్‌బస్టర్ సాధించాలనే కసితో ఉన్నాడు. ఈ మేరకు వీఐ ఆనంద్ దర్శకత్వంలో డిస్కోరాజా సినిమా మొదలుపెట్టాడు. ఎస్.ఆర్.టి. ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రామ్ తాళ్లూరి నిర్మాతగా వ్యవహరిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. రవితేజ అభిమానుల టేస్ట్‌కి సరిపోయేలా ఈ సినిమా రూపొందిస్తున్నారని తెలిసింది.
తాజాగా డిస్కో రాజా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసింది చిత్రయూనిట్. ఈ డేట్ తెలుపుతూ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది. మొదట డిసెంబర్ 20 తేదీన ఈ సినిమా విడుదల చేయాలని భావించినప్పటికీ తాజా ఆ తేదీని వాయిదా వేసి జనవరి 24 ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్న రవితేజ.. మార్క్ చేసుకోండి అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం డిస్కో రాజా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. డిసెంబర్ మొదటి వారంలో ఈ సినిమా టీజర్ విడుదల చేయనున్నారు.

ఈ మేరకు డిస్కో రాజా షూటింగ్ చేస్తూనే ప్రేక్షకుల్లో ఆసక్తి నింపేలా అప్‌డేట్స్ రిలీజ్ చేస్తూ వచ్చింది చిత్రయూనిట్. ఈ క్రమంలోనే విడుదలైన మొదటి పాట 'నువ్వు నాతో ఏమన్నావో' మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. సైన్స్ ఫిక్షన్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న డిస్కో రాజా సినిమాలో రవితేజ సరసన నభా నటేష్, పాయల్ రాజ్‌పుత్, ప్రియాంక జవల్కర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్, సత్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిత్రంలో రవితేజ రెండు డిఫెరెంట్ షేడ్స్‌లో కనిపించనున్నాడు. వృద్దుడిగా, యువకుడిగా రవితేజ నటన అబ్బురపరచనుందని తెలుస్తోంది. సో ఫైనల్‌గా జనవరి 24 నుంచి డిస్కో రాజా దూకుడు మొదలు కానుందన్నమాట.


Click it and Unblock the Notifications











