మాస్ మహారాజా రెడీ అయ్యాడు.. 'డిస్కోరాజా' రిలీజ్ డేట్ ఫిక్స్
వరుస పరాజయాలతో డౌన్ ట్రెండ్‌లో ఉన్న మాస్ మహారాజా రవితేజ ఈ సారి ఎలాగైనా హిట్ పట్టేయాలని వీరోచితంగా కష్టపడుతున్నాడు. ఆయన నెక్స్ట్ మూవీ డిస్కో రాజా కోసం రవితేజ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. జిమ్ములో వర్కవుట్స్ చేసి సరికొత్త లుక్ లోకి వచ్చేశాడు. ఈ లుక్ లోనే తన కొత్త సినిమా 'డిస్కోరాజా'లో కనిపించనున్నాడు ఈ మాస్ మాహారాజా.
ఇటీవలే స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా డిస్కోరాజా పోస్టర్ రిలీజ్ చేయగా దానికి మంచి స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తూ అఫీషియల్ ప్రకటన ఇచ్చింది చిత్రయూనిట్. సెప్టెంబర్ 20 వ తేదీన డిస్కో రాజా రూపంలో డిస్కో రాజా సందడి షురూ కానుందని తెలిపారు. ఇక డిస్కో రాజా టీజర్ వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 5న విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. చిత్రంలో రవితేజ రెండు డిఫెరెంట్ షేడ్స్‌లో కనిపించనున్నాడు. వృద్దుడిగా, యువకుడిగా రవితేజ నటన అబ్బురపరచనుందని తెలుస్తోంది.

'ఎక్కడికి పోతావు చిన్నవాడా' ఫేమ్ వీఐ ఆనంద్ దర్శకత్వంలో 'డిస్కోరాజా' సినిమా తెరకెక్కింది. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్, నభ నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్‌ఎస్ తమన్ స్వరకర్త. వెన్నెల కిషోర్, సునీల్ ప్రధాన పాత్రలో నటించనున్న ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ బ్యాగ్ డ్రాప్‌తో రానుంది. దీంతో ఈ సినిమాపై రవితేజ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులపై భారీ అంచనాలు నెలకొన్నాయి.


Click it and Unblock the Notifications











