రవితేజ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఒకే రోజు రెండు పండుగలు
స్వయంకృషితో తెలుగు సినీ ఇండస్ట్రీకి వచ్చాడు మాస్ మహారాజా రవితేజ. కెరీర్ ఆరంభంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాలు చేసి.. ఆ తర్వాత హీరోగా నిలదొక్కుకున్నాడు. ఈ క్రమంలోనే హిట్ చిత్రాలతో స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ఐదు పదుల వయసులోనే ఎంతో ఎనర్జీతో కనిపిస్తూ.. కుర్ర హీరోలకు పోటీగా నిలుస్తున్నాడు. ఏడాదికి రెండు సినిమాలైనా చేసే రవితేజ.. ఈ మధ్య కొంచెం స్పీడు తగ్గించాడు. ప్రస్తుతం అతడు ఒకే ఒక్క సినిమాను చేస్తున్నాడు. అదే 'డిస్కోరాజా'.
రవితేజ ప్రస్తుతం 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' ఫేమ్ వీఐ ఆనంద్ దర్శకత్వంలో 'డిస్కోరాజా' అనే సినిమా చేస్తున్నాడు. కొద్దిరోజులుగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్, నభ నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్‌ఎస్ తమన్ స్వరకర్త. వెన్నెల కిషోర్, సునీల్ ప్రధాన పాత్రలో నటించనున్న ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ బ్యాగ్ డ్రాప్‌తో రానుంది. దీంతో ఈ సినిమాపై రవితేజ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులపై ఎన్నో అంచనాలు ఉన్నాయి.

ఇటీవల 'డిస్కోరాజా' సినిమా ప్రీ లుక్ విడుదలైంది. దీనికి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ బయటకు వచ్చింది. అదే.. డిస్కో రాజా టీజర్ గురించి. ఈ సినిమా టీజర్ వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 5న విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ మేరకు చిత్ర యూనిట్ సన్నాహాలు కూడా చేస్తుందని అంటున్నారు. ఈ టీజర్‌కు సంబంధించిన కటింగ్‌ను త్వరగా పూర్తి చేయాలని రవి తేజ.. డైరెక్టర్ ఆనంద్‌కు సూచించాడని అంటున్నారు. అంటే.. రవి తేజ అభిమానులకు ఒకే రోజు రెండు పండుగలు అన్న మాట.


Click it and Unblock the Notifications











