‘ఖిలాడీ’ నుంచి శివరాత్రి స్పెషల్ పోస్టర్: వైలెంట్ లుక్‌తో దర్శనమిచ్చిన రవితేజ
దాదాపు రెండు దశాబ్ధాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన మార్క్ చూపిస్తూ దూసుకుపోతున్నాడు మాస్ మహారాజా రవితేజ. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో విజయాలను అందుకున్న అతడు.. కొంత కాలంగా సరైన హిట్ పడక ఇబ్బందులు పడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో గోపీచంద్ మలినేని తెరకెక్కించిన 'క్రాక్'తో భారీ సక్సెసే వచ్చింది. ఎన్నో అంచనాల నడుమ గత సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా ఘన విజయాన్ని నమోదు చేసుకోవడంతో పాటు కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది. ఈ రిజల్ట్ ఇచ్చిన జోష్‌లోనే అతడు 'ఖిలాడీ' అనే సినిమాలో నటిస్తున్నాడు.
రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడీ' అనే సినిమా చేస్తున్నాడు. ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్, గ్లిమ్స్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఇలాంటి సమయంలో మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో మాస్ మహారాజా చేతిలో గన్ పట్టుకుని వైలెంట్‌గా దర్శనమిస్తున్నాడు. దీంతో ఈ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఫలితంగా ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రవితేజ కెరీర్‌లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను పెన్ స్టూడియోస్ సమర్పణలో హవీష్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. సస్పెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కూడా ఇందులో కీలక పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇది మే 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











