Khiladi Censor Report: ఖిలాడికి ఆ సర్టిఫికెట్.. రన్ టైమ్ ఎంతో తెలిస్తే!

బ్యాగ్రౌండ్ లేకపోయినా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. సుదీర్ఘ ప్రయాణం తర్వాత స్టార్‌డమ్‌ను అందుకున్న హీరో రవితేజ. మరీ ముఖ్యంగా బీ, సీ సెంటర్ల ఆడియెన్స్‌కు చేరువైన అతడు.. మాస్ మహారాజాగా పేరు తెచ్చుకున్నాడు. అప్పటి నుంచి మరింత దూకుడు ప్రదర్శించిన ఈ సీనియర్ హీరో.. వరుసగా కమర్షియల్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అయితే, చాలా రోజుల పాటు సరైన హిట్ లేక ఇబ్బందులు పడిన రవితేజ.. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన 'క్రాక్' మూవీతో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. అంతేకాదు, ఇది అతడి కెరీర్‌లోనే భారీ వసూళ్లను రాబట్టి బిగ్గెస్ట్ హిట్‌గానూ నిలిచింది.

'క్రాక్' రిజల్ట్ ఇచ్చిన ఉత్సాహంతో ఉన్న రవితేజ.. దీని తర్వాత వరుస పెట్టి సినిమాల మీద సినిమాలను మొదలు పెట్టేశాడు. అందులో రమేష్ వర్మ తెరకెక్కించిన 'ఖిలాడి' ఒకటి. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ షూటింగ్ కరోనా ముందు వరకూ శరవేగంగా సాగుతూ వచ్చింది. అయితే, ఆ తర్వాత కరోనా సెకెండ్ వేవ్ రావడంతో కొంత భాగం బ్యాలెన్స్ ఉండిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది రోజుల క్రితమే దీన్ని పున: ప్రారంభించి టాకీ పార్ట్ మొత్తాన్ని ఎంతో వేగంగా కంప్లీట్ చేశారు. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను కూడా పూర్తి చేసి ఇప్పుడు దీన్ని విడుదలకు సిద్ధంగా ఉంచారు.

 Ravi Tejas Khiladi Movie Censor and Run Time Details Out

మాస్ మహారాజా రవితేజ నటించిన 'ఖిలాడీ' మూవీ క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందింది. ఈ సినిమాను గత ఏడాది మేలోనే రిలీజ్ చేయాలని భావించారు. కానీ, కరోనా సెకెండ్ వేవ్ కారణంగా అది కుదరలేదు. ఆ తర్వాత దీన్ని గత డిసెంబర్‌లో రిలీజ్ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ, అప్పటికి కూడా పనులు కంప్లీట్ కాకపోవడంతో ఈ సినిమాను ఫిబ్రవరి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ఇటీవలే ప్రకటించింది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రాన్ని మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఇందుకోసం తగిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.

'ఖిలాడి' మూవీని ఫిబ్రవరి 11న విడుదల చేయబోతున్నారు. దీంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు సైతం వేగం పుంజుకున్నాయి. ఇప్పటికే చిత్ర యూనిట్ వరుసగా ఇంటర్వ్యూలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. అలాగే, ఈరోజు సాయంత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ మూవీ సెన్సార్ పూర్తైనట్లు తెలిసింది. ఇక, దీనికి సెన్సార్ బోర్డ్ సభ్యులు యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేశారు. ఈ సినిమా మొత్తం 2 గంటల 34 నిమిషాల నిడివితో రాబోతుంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా అదిరిపోయేలా వచ్చిందని అంటున్నారు.

 Ravi Tejas Khiladi Movie Censor and Run Time Details Out

'ఖిలాడీ' మూవీలో రవితేజ డుయల్ రోల్ చేశాడు. ఈ సినిమాను సత్యనారాయణ కోనేరు, రమేష్ వర్మ పెన్మెశ్చ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లుగా నటించారు. హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్, యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇప్పటికే దీని నుంచి వచ్చిన అన్ని అప్‌డేట్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక, ఈ మూవీని హిందీలోనూ విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X