twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రవితేజ ‘ఖిలాడీ’ నుంచి యాక్షన్ సీన్ లీక్: హాలీవుడ్ రేంజ్‌లో ఛేజింగ్ సీక్వెన్స్

    |

    ఈ ఏడాది ఆరంభంలోనే 'క్రాక్' మూవీతో భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు మాస్ మహారాజా రవితేజ. చాలా కాలం తర్వాత వచ్చిన ఈ విజయంతో అతడు ఫుల్ ఖుషీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే రమేశ్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడీ' అనే సినిమాను ప్రారంభించేశాడు. యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ చాలా వరకూ పూర్తైంది. ఇక, ఇప్పుడు కరోనా ప్రభావం కారణంగా చిత్రీకరణ ఆగిపోయింది. దీంతో సినిమా విడుదల కూడా వాయిదా పడిపోయింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుంచి ఓ భారీ యాక్షన్ సీన్ వీడియో బయటకు వచ్చింది.

    రవితేజ హీరోగా నటిస్తోన్న 'ఖిలాడీ' మూవీ షూటింగ్ ఆ మధ్య ఇటలీలో జరిగింది. అక్కడ హీరో, విలన్ గ్యాంగ్‌పై భారీ యాక్షన్ సీన్స్‌ను తెరకెక్కించారు. మరీ ముఖ్యంగా అందులో ఓ బైక్ ఛేజింగ్ సీన్ ప్రతిష్టాత్మకంగా షూట్ చేశారు. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో లీక్ అయింది. దీన్ని ఎవరో ట్విట్టర్‌లో షేర్ చేయగా.. అది క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. ఇక, ఈ వీడియోలో హాలీవుడ్ రేంజ్ ఛేజింగ్ సీన్ ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే, బైక్‌పై ఉన్నది రవితేజయేనా అతడి డూపా అన్నది మాత్రం క్లారిటీ లేదు. మొత్తానికి ఈ వీడియో సినిమాపై అంచనాలను పెంచేసింది.

    Mass Maharaj Ravi Teja Doing Khiladi Movie Under Ramesh Varma Direction. Now This Movie Chasing Scene Leaked.

    రవితేజ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో రాబోతుంది. ఇందులో మాస్ మహారాజా డబుల్ రోల్ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇక, ఈ సినిమాను సత్యనారాయణ కోనేరు, రమేష్ వర్మ పెన్మెశ్చ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్, యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలు చేస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నాడు.

    English summary
    Mass Maharaj Ravi Teja Doing Khiladi Movie Under Ramesh Varma Direction. Now This Movie Chasing Scene Leaked.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X