Don't Miss!
- Sports DC vs RR: రిషభ్ పంత్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 31 పరుగులు! వీడియో
- News కేసీఆర్ కాన్వాయ్‌లో ప్రమాదం: ఒకదానికొకటి 8 వాహనాలు ఢీ
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రవితేజ ‘ఖిలాడీ’ నుంచి యాక్షన్ సీన్ లీక్: హాలీవుడ్ రేంజ్లో ఛేజింగ్ సీక్వెన్స్
ఈ ఏడాది ఆరంభంలోనే 'క్రాక్' మూవీతో భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు మాస్ మహారాజా రవితేజ. చాలా కాలం తర్వాత వచ్చిన ఈ విజయంతో అతడు ఫుల్ ఖుషీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే రమేశ్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడీ' అనే సినిమాను ప్రారంభించేశాడు. యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ చాలా వరకూ పూర్తైంది. ఇక, ఇప్పుడు కరోనా ప్రభావం కారణంగా చిత్రీకరణ ఆగిపోయింది. దీంతో సినిమా విడుదల కూడా వాయిదా పడిపోయింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుంచి ఓ భారీ యాక్షన్ సీన్ వీడియో బయటకు వచ్చింది.
రవితేజ హీరోగా నటిస్తోన్న 'ఖిలాడీ' మూవీ షూటింగ్ ఆ మధ్య ఇటలీలో జరిగింది. అక్కడ హీరో, విలన్ గ్యాంగ్‌పై భారీ యాక్షన్ సీన్స్‌ను తెరకెక్కించారు. మరీ ముఖ్యంగా అందులో ఓ బైక్ ఛేజింగ్ సీన్ ప్రతిష్టాత్మకంగా షూట్ చేశారు. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో లీక్ అయింది. దీన్ని ఎవరో ట్విట్టర్లో షేర్ చేయగా.. అది క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. ఇక, ఈ వీడియోలో హాలీవుడ్ రేంజ్ ఛేజింగ్ సీన్ ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే, బైక్‌పై ఉన్నది రవితేజయేనా అతడి డూపా అన్నది మాత్రం క్లారిటీ లేదు. మొత్తానికి ఈ వీడియో సినిమాపై అంచనాలను పెంచేసింది.
రవితేజ కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో రాబోతుంది. ఇందులో మాస్ మహారాజా డబుల్ రోల్ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇక, ఈ సినిమాను సత్యనారాయణ కోనేరు, రమేష్ వర్మ పెన్మెశ్చ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్, యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలు చేస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నాడు.