twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఖిలాడీ’ కూడా వెనక్కి వెళ్లిపోయాడు: అధికారికంగా ప్రకటించిన రవితేజ టీమ్

    |

    చాలా రోజులుగా మంచి హిట్ దొరకక సతమతం అవుతోన్న సమయంలో.. ఈ సంక్రాంతికి వచ్చిన 'క్రాక్'తో భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు మాస్ మహారాజా రవితేజ. గోపీచంద్ మలినేని రూపొందించిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో ఈ మాస్ హీరోలో కొత్త ఉత్సాహం వచ్చింది. ఈ జోష్‌లోనే రవితేజ వెంటనే 'ఖిలాడీ' అనే సినిమాను ప్రారంభించేశాడు. కొద్ది రోజుల్లోనే ఈ మూవీ విడుదల కావాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దీని నుంచి తాజాగా ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

    'ఖిలాడీ' సినిమాను మే 28న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించింది. అదే రోజున నందమూరి బాలకృష్ణ 'అఖండ' కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయినప్పటికీ వెనక్కి తగ్గేదే లేదని రవితేజ టీమ్ భావించింది. అయితే, ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విళయ తాండవం చేస్తోంది. దీంతో సినిమాలన్నీ వాయిదా పడుతున్నాయి. ఈ క్రమంలోనే 'ఖిలాడీ' కూడా రిలీజ్ అవడం కష్టమేనని అంతా అనుకున్నారు. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాను విడుదలను వాయిదా వేస్తున్నట్లు తాజాగా ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

    Ravi Tejas Khiladi Movie Postponed

    ఈ మేరకు సోషల్ మీడియా ఖాతాల ద్వారా చిత్ర యూనిట్ ఓ ప్రకటనను విడుదల చేసింది. అందులో 'కరోనా పరిస్థితుల కారణంగా ఖిలాడీ సినిమాను వాయిదా వేస్తున్నాం. కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటిస్తాం' అని వెల్లడించింది. ఇక, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాను సత్యనారాయణ కోనేరు, రమేష్ వర్మ పెన్మెశ్చ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాక్‌స్టార్‌ దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు.

    English summary
    It is a known fact that Mass Maharaj Ravi Teja and director Ramesh Varma’s action entertainer Khiladi is in the initial stages of production. Ravi Teja plays a dual role in the film produced by Satyanarayana Koneru. The latest update is that a massive jail set is erected in Hyderabad where important sequences are...
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X