Khiladi Trailer: రవితేజ అభిమానులకు కిక్కిచ్చే అప్‌డేట్.. రెండు వదులుతారా!
ఆ మధ్య కొన్ని వరుస పరాజయాలతో తెగ ఇబ్బందులు పడ్డాడు మాస్ మహారాజా రవితేజ. అయినప్పటికీ సినిమాల మీద సినిమాలు చేస్తూనే వచ్చాడు. ఈ క్రమంలోనే గత ఏడాది సంక్రాంతికి వచ్చిన 'క్రాక్' మూవీతో మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. కరోనా నిబంధనల ప్రకారం అప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో యాభై శాతం ఆక్యూపెన్సీ ఉన్నా కలెక్షన్లను కూడా భారీ స్థాయిలో రాబట్టింది. ఫలితంగా సూపర్ డూపర్ హిట్ అయింది. అంతేకాదు, ఇది అతడి కెరీర్‌లోనే భారీ లాభాలను తెచ్చిపెట్టిన మూవీగా నిలిచింది. ఈ ఉత్సాహంతోనే రవితేజ తన ఫ్యూచర్ ప్రాజెక్టులను కూడా లైన్‌లో పెట్టుకుంటూ దూసుకుపోతోన్నాడు.
ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ నటిస్తోన్న చిత్రాల్లో 'ఖిలాడీ' ఒకటి. రమేష్ వర్మ రూపొందిస్తోన్న ఈ సినిమా పుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న విషయం తెలిసిందే. చాలా రోజుల క్రితమే మొదలైన ఈ మూవీ షూటింగ్.. కరోనా ముందు వరకూ శరవేగంగా సాగుతూ వచ్చింది. అయితే, ఆ తర్వాత కరోనా సెకెండ్ వేవ్ రావడంతో కొంత భాగం బ్యాలెన్స్ ఉండిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది రోజుల క్రితమే దీన్ని పున: ప్రారంభించి టాకీ పార్ట్ మొత్తాన్ని ఎంతో వేగంగా కంప్లీట్ చేశారు. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ఆరంభించి.. వాటిని కూడా ఇటీవలే పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

టాలీవుడ్ మాస్ హీరో రవితేజ నటించిన 'ఖిలాడీ' మూవీ క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందింది. ఈ సినిమాను గత ఏడాది మేలోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, కరోనా సెకెండ్ వేవ్ కారణంగా అది సాధ్య పడలేదు. ఆ తర్వాత ఈ సినిమాను గత డిసెంబర్‌లో రిలీజ్ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ, అప్పటికి కూడా పనులు కంప్లీట్ కాకపోవడంతో దీన్ని ఫిబ్రవరి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ఇటీవలే అనౌన్స్ చేసింది. అయితే, ఇప్పుడేమో ఆంధ్రప్రదేశ్‌లో యాభై శాతం ఆక్యూపెన్సీతో పాటు నైట్ కర్ఫ్యూ ఉండడంతో ఈ సినిమా మరోసారి వాయిదా పడే అవకాశాలు కూడా ఉన్నాయని వార్తలు వచ్చాయి.
ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతోన్న నేపథ్యంలో 'ఖిలాడీ' మూవీని ఫిబ్రవరి 11నే విడుదల చేస్తున్నట్లు యూనిట్ వెల్లడించింది. అంతేకాదు, దీన్ని హిందీలోనూ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్‌ను ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నారు. దీన్ని ఫిబ్రవరి 7న, సాయంత్రం 5: 04 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా వదిలారు. ఇక, ఈ సినిమా రెండు భాషల్లో వస్తుండడంతో ట్రైలర్ కూడా తెలుగు, హిందీ వెర్షన్లతో వస్తుందా అన్న ఆసక్తి అందరిలో ఉంది.
యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న 'ఖిలాడీ' మూవీలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ సినిమాను సత్యనారాయణ కోనేరు, రమేష్ వర్మ పెన్మెశ్చ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్, యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చుతున్నాడు.


Click it and Unblock the Notifications











