న్యూ ఇయర్‌కు డబుల్ సర్‌ప్రైజ్ ఇచ్చిన రవితేజ: ఆసక్తికర పోస్టర్ రిలీజ్ చేసిన ‘ఖిలాడీ’

పరాజయాలు పలకరిస్తున్నా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు మాస్ మహారాజా రవితేజ. ఇప్పటికే గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తోన్న 'క్రాక్'లో నటిస్తున్న ఆయన.. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నారు. ఆ వెంటనే రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తోన్న 'ఖిలాడీ' కోసం సిద్ధం అయ్యారు. ఇటీవలే సెట్స్ మీద దిగిన ఓ సెల్ఫీని సోషల్ మీడియాలో షేర్ చేశారు. దానికి 'ఇన్ యాక్షన్ మోడ్' అంటూ క్రేజీ క్యాప్షన్ పెట్టడంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి నూతన సంవత్సరం కానుకగా స్పెషల్ పోస్టర్ రిలీజ్ అయింది.

'ఖిలాడీ' సర్‌ప్రైజ్ కోసం 2021 జనవరి 1వ తేదీ ఉదయం 9 గంటలకు సిద్ధంగా ఉండండని తెలుపుతూ గురువారం ఓ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. అందుకు అనుగుణంగానే తాజాగా సినిమాకు సంబంధించిన స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. ఇందులో రెండు గెటప్‌లలో కనిపిస్తున్నాడు మాస్ మహారాజా రవితేజ. ఒక గెటప్‌లో అమాయకంగా.. మరో గెటప్‌లో కన్నింగ్‌గా కనిపిస్తున్నాడాయన. దీంతో ఈ సినిమా ఆసక్తికరంగా ఉంటుందనిపిస్తోంది. దీనిని విడుదల చేసిన రవితేజ 'మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడానికి సమ్మర్‌లో వస్తున్నాం' అని ప్రకటించాడు.

Ravi Tejas Khiladi New Year Poster Released

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. డా.జయంతిలాల్‌ గడ సమర్పణలో ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్‌ దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఇధిలా ఉండగా, రవితేజ నటించిన మరో చిత్రం 'క్రాక్' సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. ఇప్పటికే చిత్రంలోని పలు పాటలు విడుదల అయ్యాయి. వాటన్నింటికీ భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X