Khiladi Movie Teaser: ఆసక్తికరంగా ‘ఖిలాడీ’ టీజర్.. వైలెంట్ లుక్‌తో భయపెట్టిన రవితేజ
ఈ ఏడాది ఆరంభంలోనే సంక్రాంతి పండుగ కానుకగా వచ్చిన 'క్రాక్' అనే మూవీతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు మాస్ మహారాజా రవితేజ. చాలా కాలంగా సరైన హిట్ లేక ఇబ్బందులు పడుతోన్న అతడిని ఈ చిత్రమే గట్టెక్కించింది. అంతేకాదు, కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది. దీంతో ఈ సీనియర్ హీరో రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళ్లాలని డిసైడ్ అయిపోయాడు. ఇందులో భాగంగానే ప్రస్తుతం 'ఖిలాడీ' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ మూవీ టీజర్ కొద్ది సేపటి క్రితమే విడుదలైంది.
రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ నటిస్తోన్న చిత్రమే 'ఖిలాడీ'. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీ టీజర్.. ఉగాది పండుగ సందర్భంగా సోమవారమే విడుదలైంది. 79 సెకెండ్ల నిడివి ఉన్న ఈ టీజర్ ఎంతో ఆసక్తికరంగా సాగింది. ఇందులో రవితేజను జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీగా.. స్టైలిష్ మాఫియా డాన్‌గా రెండు షేడ్స్‌లో చూపించారు. మరీ ముఖ్యంగా టీజర్ చివర్లో ఓ అమ్మాయిని రవితేజ చంపే సీన్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. ఇక, ఇందులో యాక్షన్ హీరో అర్జున్‌తో పాటు అనసూయ భరద్వాజ్, హీరోయిన్లు కూడా దర్శనమిచ్చారు. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ కొత్తగా, ఆసక్తిని కలిగించేలా ఉంది. చివర్లో రవితేజ చెప్పే డైలాగ్ కూడా ఆకట్టుకుంది.

యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'ఖిలాడీ' చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాను సత్యనారాయణ కోనేరు, రమేష్ వర్మ పెన్మెశ్చ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇది మే 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











