Just In
- 3 hrs ago
శివరాత్రికి ‘శ్రీకారం’.. శర్వానంద్ సందడి అప్పుడే!
- 3 hrs ago
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- 4 hrs ago
HBD Namrata.. ఐదేళ్లలో 29 హెల్త్ క్యాంప్స్.. అందుకే మహేష్ బాబుకు ఇంతటి క్రేజ్!
- 5 hrs ago
‘ఖిలాడీ’ అప్డేట్.. రవితేజ మరీ ఇంత ఫాస్ట్‌గా ఉన్నాడేంటి!
Don't Miss!
- News
43 లక్షల మంది ఇళ్లకు బీజేపీ కార్యకర్తలు.. హస్తిన పురవీధుల్లో.. ఎందుకంటే
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Automobiles
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
‘క్రాక్’ సెన్సార్ పూర్తి: రవితేజ సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇచ్చారో తెలుసా?
టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని - మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'క్రాక్'. 'డాన్ శ్రీను', 'బలుపు' వంటి హిట్ల తర్వాత వీళ్లిద్దరి కలయికలో వస్తున్న సినిమా ఇది. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టేసింది. ఇందులో భాగంగానే ఇప్పటికే సినిమాలోని కొన్ని పాటలను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇక, నూతన సంవత్సర కానుకగా జనవరి 1వ తేదీన 'క్రాక్' ట్రైలర్‌ను విడుదల చేశారు.
పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సాగిన ఈ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా దాదాపు పది మిలియన్ల పైచిలుకు వ్యూస్ వచ్చాయి. అలాగే, లైకులు కూడా భారీగానే అందుకుందీ ట్రైలర్. రవితేజ కెరీర్‌లోనే బెస్ట్ ట్రైలర్‌గా నిలిచిందిది. తద్వారా యూట్యూబ్‌లో ఎన్నో రికార్డులు బద్దలైపోయాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా 'క్రాక్' మూవీ సెన్సార్ పూర్తయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. మాస్, రొమాంటిక్ ఎలిమెంట్లతో సాగే ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ నుంచి U/A సర్టిఫికెట్ వచ్చింది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్‌పై ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, కోలీవుడ్ హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ లేడీ విలన్‌గా కనిపించనుంది. ఆమెతో పాటు సముద్రఖని, రవి శంకర్ కూడా నెగెటివ్ రోల్స్ చేస్తున్నారు. ఇక, ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.