twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రికార్డు క్రియేట్ చేసిన ‘క్రాక్’ ట్రైలర్: సినిమా చూశానంటూ ట్వీట్ చేసిన సాయి మాధవ్

    |

    సుదీర్ఘ కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు మాస్ మహారాజా రవితేజ. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు నచ్చే సినిమాలతో పాటు అప్పుడప్పుడూ క్లాస్ టచ్ ఇస్తూ మెప్పిస్తున్నాడాయన. ఈ క్రమంలోనే కొన్ని పరాజయాలను ఎదుర్కొన్నప్పటికీ.. ఏమాత్రం వెనకడుగు వేయకుండా దూసుకుపోతున్నాడు. ఇలానే వరుస పెట్టి సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు పోటీగా నిలుస్తున్నాడు. ఈ నేపథ్యంలో టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో 'క్రాక్' అనే సినిమా చేశాడు. తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది.

    రవితేజ - గోపీచంద్ మలినేని కలయికలో రూపొందిన చిత్రం 'క్రాక్'. నూతన సంవత్సర కానుకగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. దాదాపు రెండున్నర నిమిషాలు ఉన్న దీనికి ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. మరీ ముఖ్యంగా మాస్ ఆడియెన్స్‌ను ఇది బాగా ఆకట్టుకుంది. ఫలితంగా ఇది 24 గంటల్లోనే 7 మిలియన్ పైచిలుకు వ్యూస్ సాధించి, రవితేజ కెరీర్‌లోనే బెస్ట్ ట్రైలర్‌గా రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాదు, దీనికి రెండు లక్షలకు పైగా లైకులు కూడా వచ్చాయి. దీంతో ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతోంది.

    Ravi Tejas Krack Trailer Create Records in Youtube

    ఇక, ఈ చిత్రానికి డైలాగ్ రైటర్‌గా పని చేసిన రైటర్ సాయి మాధవ్ బుర్రా 'అందరూ క్రాక్ ట్రైలర్ బాగుందని అంటున్నారు. నేను సినిమామొత్తం చూశా. నోడౌట్.. షూర్ షాట్.. సూపర్ హిట్. నాటుకోడి కూర, కొరమేను పులుసు, మిరియాల చారుతో భోంచేసినంత బావుంది' అని ఆయన ట్వీట్ చేశారు. ఇక, రవితేజ కెరీర్‌లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాలో శృతీ హాసన్ హీరోయిన్‌గా చేసింది. కోలీవుడ్ హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్, సముద్రఖని నెగెటివ్ రోల్స్ చేశారు. ఠాగూర్ మధు నిర్మించిన ఈ చిత్రానికి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించాడు.

    English summary
    The cast of Ravi Teja's next project under Gopichand Malineni's direction is getting bigger and bigger with every passing day. The makers have already roped in noted Tamil actor, Samuthirakami and Shruti Hassan for this project. The latest addition to the list is Varalaxmi Sarathkumar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X