Don't Miss!
- News కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారును ఏకిపారేసిన కేసీఆర్
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ అలవాట్లు మీకు తెలియకుండానే మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తాయి...!
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రికార్డు క్రియేట్ చేసిన ‘క్రాక్’ ట్రైలర్: సినిమా చూశానంటూ ట్వీట్ చేసిన సాయి మాధవ్
సుదీర్ఘ కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు మాస్ మహారాజా రవితేజ. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు నచ్చే సినిమాలతో పాటు అప్పుడప్పుడూ క్లాస్ టచ్ ఇస్తూ మెప్పిస్తున్నాడాయన. ఈ క్రమంలోనే కొన్ని పరాజయాలను ఎదుర్కొన్నప్పటికీ.. ఏమాత్రం వెనకడుగు వేయకుండా దూసుకుపోతున్నాడు. ఇలానే వరుస పెట్టి సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు పోటీగా నిలుస్తున్నాడు. ఈ నేపథ్యంలో టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో 'క్రాక్' అనే సినిమా చేశాడు. తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది.
రవితేజ - గోపీచంద్ మలినేని కలయికలో రూపొందిన చిత్రం 'క్రాక్'. నూతన సంవత్సర కానుకగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. దాదాపు రెండున్నర నిమిషాలు ఉన్న దీనికి ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. మరీ ముఖ్యంగా మాస్ ఆడియెన్స్‌ను ఇది బాగా ఆకట్టుకుంది. ఫలితంగా ఇది 24 గంటల్లోనే 7 మిలియన్ పైచిలుకు వ్యూస్ సాధించి, రవితేజ కెరీర్లోనే బెస్ట్ ట్రైలర్‌గా రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాదు, దీనికి రెండు లక్షలకు పైగా లైకులు కూడా వచ్చాయి. దీంతో ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతోంది.
ఇక, ఈ చిత్రానికి డైలాగ్ రైటర్‌గా పని చేసిన రైటర్ సాయి మాధవ్ బుర్రా 'అందరూ క్రాక్ ట్రైలర్ బాగుందని అంటున్నారు. నేను సినిమామొత్తం చూశా. నోడౌట్.. షూర్ షాట్.. సూపర్ హిట్. నాటుకోడి కూర, కొరమేను పులుసు, మిరియాల చారుతో భోంచేసినంత బావుంది' అని ఆయన ట్వీట్ చేశారు. ఇక, రవితేజ కెరీర్లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాలో శృతీ హాసన్ హీరోయిన్గా చేసింది. కోలీవుడ్ హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్, సముద్రఖని నెగెటివ్ రోల్స్ చేశారు. ఠాగూర్ మధు నిర్మించిన ఈ చిత్రానికి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించాడు.
Krack ట్రైలర్ చూసినవాళ్లందరూ చాలాబాగుందంటున్నారు ..నేను సినిమామొత్తం చూశా ..
— Saimadhav Burra (@saimadhav_burra) January 2, 2021
నోడౌట్ ..షూర్ షాట్ ..సూపర్ హిట్ ..
నాటుకోడి కూర ,కొరమేనుపులుసు ,
మిరియాలచారు తో భోంచేసినంత బావుంది .@UrsVamsiShekar