న్యూ ఇయర్ కానుకగా ‘క్రాక్’ ట్రైలర్: మాస్ తుఫాను మొదలయ్యేది అప్పుడే

ఐదు పదుల వయసులోనూ కుర్రాళ్లు పోటీగా ఎనర్జీని చూపిస్తూ దూసుకుపోతున్నాడు మాస్ మహారాజా రవితేజ. ఒకానొక సమయంలో వరుస విజయాలను అందుకుని తన హవాను చూపించిన ఆయన.. ఈ మధ్య కాలంలో పెద్దగా రాణించలేకపోతున్నాడు. ఫలితంగా చాలా పరాజయాలను చవి చూడాల్సి వచ్చింది. దీంతో ఈ సారి పక్కాగా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడాయన. ఇలాంటి పరిస్థితుల్లో టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తోన్న 'క్రాక్'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి.

'డాన్ శీను', 'బలుపు' వంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత గోపీచంద్ మలినేని - రవితేజ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం 'క్రాక్'. ఠాగూర్ మధు నిర్మిస్తోన్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ నూతన సంవత్సర కానుకగా జనవరి 1వ తేదీన ఉదయం 11 గంటలకు రాబోతుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ మాస్ స్ట్రామ్ మరో 48 గంటల్లో ప్రారంభం కాబోతుందని చెబుతూ ట్వీట్ చేసింది. ఇటీవలే విడుదలైన ఈ సినిమాలోని పాటలన్నింటికీ ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చిన విషయం తెలిసిందే.

Ravi Tejas Krack Trailer Release Date Fix

వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో పూర్తి కావాలి. కానీ, కరోనా ప్రభావంతో షూటింగ్ వాయిదా పడింది. ఇటీవల పరిస్థితులు చక్కబడడంతో గోవా వెళ్లి కొన్ని ముఖ్యమైన సీన్లతో పాటు పాటను చిత్రీకరించారు. అప్పటి నుంచి ఒక్కో పాటను వదులుతున్నారు. ఇక, ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేస్తున్నారు. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేశారు. ఇందులో భాగంగానే ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా కోలీవుడ్ హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ లేడీ విలన్‌గా నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X