‘క్రాక్’ ట్రైలర్: ప్యూర్ షాట్.. నో డౌట్.. పుచ్చె పగిలిపోద్ది.. రవితేజ హిట్టు కొట్టేలా ఉన్నాడుగా

'రాజా ది గ్రేట్' తర్వాత వరుస పరాజయాలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు మాస్ మహారాజా రవితేజ. ఈ నేపథ్యంలో ఈ సారి పక్కాగా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇందుకోసం తనకు గతంలో 'డాన్ శీను', 'బలుపు' వంటి బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన గోపీచంద్ మలినేనితో జత కట్టాడు. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న మూడో చిత్రం 'క్రాక్'. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ కొద్ది సేపటి క్రితం విడుదలైంది.

విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్‌తో 'క్రాక్' సినిమా ట్రైలర్‌ మొదలైంది. ముగ్గురు విలన్లను పరిచయం చేస్తూ.. వాళ్లకు చుక్కులు చూపిస్తున్న పోలీస్ ఆఫీసర్‌గా మాస్ మహారాజా రవితేజను చూపించారు. పవర్‌ఫుల్‌ లుక్‌తో ఎంట్రీ ఇచ్చిన హీరో.. అదిరిపోయే డైలాగులతో ఆకట్టుకున్నాడు. మరీ ముఖ్యంగా 'ప్యూర్ షాట్.. నో డౌట్.. పుచ్చె పగిలిపోద్ది'.. 'నా మూడ్ ఎలా ఉంటుందో నాకే తెలీదు. కొంచెం సేపు ఆగితే ఏది కట్ చేస్తానో నాకే తెలీదు' అని రవితేజ చెప్పిన డైలాగులు ఈలలు వేయించేలా ఉన్నాయి. ఈ ట్రైలర్‌కు ఎస్ ఎస్ థమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ మరింత బలాన్ని ఇచ్చింది. మొత్తానికి ఈ సినిమాతో అతడు హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు.

Ravi Tejas Krack Trailer Released

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'క్రాక్'ను ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన ఈ సినిమాను జనవరి 9న విడుదల చేయబోతున్నారు. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో పూర్తి కావాలి. కానీ, కరోనా ప్రభావంతో షూటింగ్ వాయిదా పడింది. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా కోలీవుడ్ హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ లేడీ విలన్‌గా నటిస్తోంది. అలాగే, సముద్రఖని కూడా నెగెటివ్ రోల్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X