twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RAVANASURA: సైలెంట్‌గా పూర్తి చేసేసిన రవితేజ.. ఇదే కొనసాగితే ఫ్యాన్స్‌కు పండగే

    |

    హిట్లు ఫ్లాపులనే బేరీజు వేసుకోకుండా సినిమాల మీద సినిమాలు చేసే హీరోల్లో మాస్ మహారాజా రవితేజ ఒకడు. స్వయంకృషితో సినిమాల్లోకి వచ్చిన అతడు.. చాలా కష్టాల తర్వాత స్టార్‌గా ఎదిగాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే గత ఏడాది 'క్రాక్' మూవీతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను సొంతం చేసుకున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రవితేజ 'ఖిలాడి' మూవీని పట్టాలెక్కించేశాడు. ఎన్నో ఆటంకాల నడుమ షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

    <strong>హనీమూన్‌లో హాట్‌గా సీరియల్ హీరోయిన్: దారుణమైన ఫోజులతో కొత్త పెళ్లికూతురు రచ్చ</strong>హనీమూన్‌లో హాట్‌గా సీరియల్ హీరోయిన్: దారుణమైన ఫోజులతో కొత్త పెళ్లికూతురు రచ్చ

    'ఖిలాడి' చిత్రంతో సందడి చేస్తోన్న మాస్ మహారాజా రవితేజ.. ప్రస్తుతం శరత్ మందవతో 'రామారావు ఆన్ డ్యూటీ' అనే సినిమాను చేస్తున్నాడు. ఇందులో దివ్యాన్షా కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో రవితేజ ప్రభుత్వ ఉద్యోగిగా నటిస్తోన్నాడు. ఈ మూవీ షూటింగ్ కూడా చాలా వరకూ కంప్లీట్ అయింది. దీన్ని మార్చి 25న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమాకు ప్రస్తుతం ఈ స్టార్ హీరో బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే.

     Ravi Tejas RAVANASURA Movie Second Schedule Completed

    ఇప్పటికే పలు చిత్రాల షూటింగ్‌లలో పాల్గొంటోన్న మాస్ హీరో రవితేజ.. వీటితో పాటు త్రినాథరావు నక్కినతో 'ధమాకా' అనే సినిమాను కూడా ప్రకటించాడు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మతో రవితేజ 'రావణాసుర' అనే సినిమాను అనౌన్స్ చేశాడు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా సంక్రాంతి పండుగకు ఈ చిత్రాన్ని ప్రారంభించారు.

    DJ Tillu Twitter Review: డీజే టిల్లుకు షాకింగ్ టాక్.. ప్లస్ మైనస్‌లు అవే.. ఫైనల్ రిపోర్ట్ ఇదేDJ Tillu Twitter Review: డీజే టిల్లుకు షాకింగ్ టాక్.. ప్లస్ మైనస్‌లు అవే.. ఫైనల్ రిపోర్ట్ ఇదే

    జనవరి 14న 'రావణాసుర' సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరగ్గా.. ఆ వెంటనే రెగ్యూలర్ షూటింగ్‌ను కూడా మొదలు పెట్టేశారు. ఇది జరిగి నెల కూడా తిరగక ముందే చాలా వరకూ షూటింగ్‌ను పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా 'రావణాసుర' మూవీ రెండో షెడ్యూల్‌ను కంప్లీట్ చేశారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా వదిలింది. ఇందులో ఈ సినిమాకు సంబంధించిన రెండో షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్నామని వెల్లడించారు. త్వరలోనే మూడో దాన్ని కూడా గ్రాండ్‌గా మొదలు పెడతారని తెలుస్తోంది.

    'రావణాసుర' మూవీలో రవితేజ లాయర్‌గా నటించబోతున్నాడట. ఇందులో భాగంగానే ఈ సినిమాలో విలన్‌గా చేస్తున్న దక్ష నాగర్కర్ ఆట కట్టించేందుకు పావులు కదుపుతాడని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ప్రీ లుక్ పోస్టర్‌కు అన్ని వర్గాల వాళ్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా దీనిపై అప్పుడే అంచనాలు ఏర్పడ్డాయి. అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్ మీద అభిషేక్ నామా, శ్రీకాంత్ విస్సా కలిసి నిర్మిస్తున్నారు.

    English summary
    Ravi Teja Recently Announced His RAVANASURA Movie Under RAVANASURA Directions. Now This Movie Second Schedule Completed
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X