Ravanasura రిలీజ్‌కు ముందే వీడియో లీక్.. రవితేజ డైలాగ్స్ వైరల్.. షాకిచ్చిన నెటిజన్

సినిమా ఇండస్ట్రీకి లీకుల వ్యవహారం తలనొప్పిగా మారుతున్నది. సినిమా రిలీజ్ కంటే ముందే.. టీజర్లు, ట్రైలర్లను కొందరు సోషల్ మీడియాలో లీక్ చేస్తూ అలజడి సృష్టిస్తుంటారు. గతంలో విడుదలకు ముందే సినిమాలు ఇంటర్నెట్‌‌లో, సోషల్ మీడియాలో ప్రత్యక్షమై సంచలనం రేపిన విషయాలు తెలిసిందే. గతంలో అత్తారింటికి దారేది, టాక్సీవాలా సినిమాలు రిలీజ్‌కు ముందే సోషల్ మీడియాలో లీక్ కావడంతో నిర్మాత, దర్శకులు, సినిమా యూనిట్లు ఆందోళనకు చెందడం తెలిసిందే. తాజాగా రావణాసుర వీడియో సోషల్ మీడియాలో లీక్ అయిన వివరాల్లోకి వెళితే..

అయితే తాజాగా మాస్ మహారాజ్ రవితేజ నటించిన రావణాసుర చిత్రం వీడియో ఇంటర్నెట్‌లో లీక్ కావడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ యూనిట్ సభ్యులు పకడ్బందీగా చర్యలు తీసుకొన్నప్పటికీ.. వీడియో క్లిప్పింగ్ బయటకు రావడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా లీకైన క్లిప్పింగ్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయం ఆసక్తికరంగా మారింది.

Ravi Tejas Ravanasura

ఇటీవల దర్శకుడు సుధీర్ వర్మ మాట్లాడుతూ.. రావణాసుర సినిమాను పాన్ ఇండియా సినిమాగా ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేయాలని అనుకొన్నాం. కానీ ఈ సినిమా కంటెంట్ చాలా సెన్సిబుల్. చాలా ట్విస్టులు ఉంటాయి. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, షాకింగ్ సీన్లు ఉంటాయి. అయితే ఇతర భాషల్లో రిలీజ్ చేయాలంటే.. 15 రోజుల ముందు కంటెంట్ వాళ్లకు ఇవ్వాలి. అయితే 15 రోజుల ముందు అంటే.. చాలా కష్టం. ఎక్కడైనా లీక్ అయితే చాలా కష్టంగా ఉంటుంది అని అన్నారు. అయితే సుధీర్ వర్మ భయపడినట్టుగానే మచ్చుగా ఓ వీడియో క్లిప్పింగ్‌ను లీక్ చేయడం ఆందోళనకు గురిచేస్తున్నది.

అంతేకాకుండా హీరోయిన్లు, ఇతర సాంకేతిక నిపుణులు రావణాసుర సినిమా కంటెంట్ గురించి మాట్లాడటానికి నిరాకరిస్తున్నారు. ఇటీవల ఇంటర్వ్యూలో ఏది మాట్లాడినా కంటెంట్ రివీల్ అయిపోతుందనే ఓ రకమైన భయానికి గురయ్యారు. ఎలాంటి ప్రశ్న అడిగినా ఆచితూచి మాట్లాడారు. అలా సెన్సిటివ్ కంటెంట్ గురించి రివీల్ చేయడానికి నిరాకరించారు. అయితే రావణాసుర సినిమాలో గ్రే షేడ్ ఉన్న క్యారెక్టర్‌ను రవితేజ చేస్తున్నారు. రవితేజ ఇప్పటి వరకు పోషించిన పాత్రలో ప్రేక్షకులను థ్రిల్లింగ్, షాక్ గురిచేస్తారు అని యూనిట్ అంటున్నారు.

అయితే తాజాగా లీకైన రావణాసుర వీడియోలో రవితేజ.. నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటించినట్టు స్పష్టమైంది. కంచం ముందుకైనా, మంచం ముందుకైనా ఆడపిల్లలు పిలువగానే రావాలి. లేకపోతే నాకు మండుద్ది. పో అంటూ గట్టిగా రవితేజ అరుస్తూ చెప్పిన డైలాగ్ చాలా ఇంటెన్సివ్‌గా ఉంది. అయితే సీరియస్, గ్రే షేడ్ క్యారెక్టర్‌లో రవితేజ ఎమోషనల్‌గా కనిపించాడు.

అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా నిర్మించిన రావణాసుర చిత్రం ఏప్రిల్ 7వ తేదీన రిలీజ్ అవుతున్నది. రవితేజ, సుశాంత్, అను ఇమ్యాన్యుయెల్, ఫరియా అబ్దులా, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడ, మేఘ ఆకాశ్ నటించారు. ఈ సినిమాకు యువ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వం వహించగా.. శ్రీకాంత్ విస్సా కథ, మాటలు అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X