మాస్ మహారాజ్ రవితేజ బర్త్ డే సర్‌ప్రైజ్: క్రాక్ మాత్రమే కాదు ఇది కూడా..
ఈ రోజు (జనవరి 26) గణతంత్య్ర దినోత్సవంతో పాటు మాస్ మహారాజ్ రవితేజ పుట్టినరోజు కూడా. ఈ సందర్బంగా రవితేజ సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ చెబుతూ సర్‌ప్రైజ్ చేశారు ఆయా చిత్రాల దర్శకనిర్మాతలు. ఒక్కటి కాదు రెండు అప్‌డేట్స్ ఒకేసారి బయటకు రావడంతో ఆయన అభిమానులు ఖుషీ అవుతున్నారు. వివరాల్లోకి పోతే..

ప్రముఖుల విషెస్.. మాస్ మహారాజ్ హ్యాపీ
రవితేజ పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరోవైపు ఆయన అభిమానులు సైతం పెద్దఎత్తున బర్త్ డే విషెస్ చెబుతూ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నారు. డిస్కో రాజా విజయం తర్వాత ఈ బర్త్ డే రావడంతో మాస్ మహారాజ్ చాలా హ్యాపీగా ఉన్నారు.

డిస్కో రాజా హంగామా.. వసూళ్లలో జోరు
ఇటీవలే డిస్కో రాజా సినిమాతో ప్రేక్షకుల ముందుకువచ్చిన రవితేజ.. తన నటనతో క్లాస్, మాస్ ఆడియన్స్ అందరినీ మెప్పించారు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమాకు వీఐ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రవితేజ సరసన పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యా హోప్ హీరోయిన్లుగా నటించారు. శుక్రవారం రిలీజైన ఈ సినిమా కలెక్షన్ల పరంగా జోరుమీదుంది.

రవితేజ బర్త్ డే సర్‌ప్రైజ్
ఈ నేపథ్యంలో రవితేజ అభిమానుల్లో మరింత జోష్ నింపుతూ ఆయన బర్త్ డే సర్‌ప్రైజ్ చెప్పారు క్రాక్ సినిమా దర్శకనిర్మాతలు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపొందుతున్న క్రాక్ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. ప్రస్తుతం చిత్రకరణ జరపుకుంటున్న ఈ సినిమాను మే 8న రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు.

ఇన్‌సైడ్ టాక్.. రవితేజ కెరీర్ లోనే
మాస్ మహరాజ్ ఇమేజ్, ఎనర్జీకి తగ్గట్టుగా అన్ని అంశాలను మేళవించి ఈ సినిమాకు క్రాక్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ పోలీస్ ఆఫీస్ పాత్రలో నటిస్తున్నారు. సరస్వతి ఫిలిం డివిజన్ బ్యానర్‌పై బీ మధు నిర్మిస్తున్న ఈ సినిమా రవితేజ కెరీర్ లోనే డిఫరెంట్ మూవీ అవుతుందని ఇన్‌సైడ్ టాక్.
Recommended Video

క్రాక్ మాత్రమే కాదు.. ఇంకోటి
ఇక మాస్ మహారాజ్ బర్త్ డే సందర్భంగా రవితేజ హీరోగా తెరకెక్కనున్న మరో సినిమాను కూడా ఎనౌన్స్ చేశారు. రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లుగా తెలిపారు. ఈ సినిమాను యంగ్ హీరో హవీష్ నిర్మించనున్నారు. ఈ రెండు సినిమాలు ఈ ఏడాదిలోనే రిలీజ్ చేసి 2020 సక్సెస్‌ఫుల్ హీరోగా నిలవాలని రవితేజ సన్నాహాలు చేస్తున్నారట.


Click it and Unblock the Notifications











