రవితేజ ఏంటి ఇలా అయిపోయాడు.. ఊహించని లుక్‌లో మాస్ మహారాజా
స్వయంకృషితో తెలుగు సినీ ఇండస్ట్రీకి వచ్చాడు మాస్ మహారాజా రవితేజ. కెరీర్ ఆరంభంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాలు చేసి.. ఆ తర్వాత హీరోగా నిలదొక్కుకున్నాడు. ఈ క్రమంలోనే హిట్ చిత్రాలతో స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ఐదు పదుల వయసులోనే ఎంతో ఎనర్జీతో కనిపిస్తూ.. కుర్ర హీరోలకు పోటీగా నిలుస్తున్నాడు. ఏడాదికి రెండు సినిమాలైనా చేసే రవితేజ.. ఈ మధ్య కొంచెం స్పీడు తగ్గించాడు. ప్రస్తుతం అతడు ఒకే ఒక్క సినిమాను చేస్తున్నాడు. అదే 'డిస్కోరాజా'.
రవితేజ ప్రస్తుతం 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' ఫేమ్ వీఐ ఆనంద్ దర్శకత్వంలో 'డిస్కోరాజా' అనే సినిమా చేస్తున్నాడు. కొద్దిరోజులుగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్, నభ నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్‌ఎస్ తమన్ స్వరకర్త. వెన్నెల కిషోర్, సునీల్ ప్రధాన పాత్రలో నటించనున్న ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ బ్యాగ్ డ్రాప్‌తో రానుంది. దీంతో ఈ సినిమాపై రవితేజ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులపై ఎన్నో అంచనాలు ఉన్నాయి.

ఇటీవల 'డిస్కోరాజా' సినిమా ప్రీ లుక్ విడుదలైంది. దీనికి మంచి స్పందన వచ్చింది. ఇక, తాజాగా రవితేజ కొత్త లుక్ ఒకటి బయటకు వచ్చింది. ఇందులో మీసాలు లేకుండా గడ్డం ట్రిమ్ చేసి ఉంది. ఇందులో రవితేజ లుక్ చూసి అందరూ షాక్‌కు గురవుతున్నారు. అస్సలు ఊహించని గెటప్‌లో అతడిని చూసిన వారంతా నోరెళ్లబెట్టేస్తున్నారు. ఈ లుక్‌లో రవితేజను చూసిన వారంతా అతడి వయసు తగ్గిపోయిందా ఏంటి అన్నట్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











