EAGLE Censor Review: ఈగల్ మూవీ సెన్సార్ రివ్యూ వచ్చేసింది.. అన్ని గంటలు మాస్ ఊచకోతే
తెలుగు చిత్ర పరిశ్రమలో మాస్ ఇమేజ్‌ను సొంతం చేసుకుని.. సుదీర్ఘ కాలంగా పక్కా కమర్షియల్ చేస్తూ దూసుకుపోతోన్నాడు మాస్ మహారాజా రవితేజ. రిజల్ట్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తోన్న అతడు.. 'ధమాకా' తర్వాత ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ కోసం వేచి చూస్తున్నాడు. ఇందుకోసం తాజాగా రవితేజ 'ఈగల్' అనే సినిమాను చేశాడు.
మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రమే 'ఈగల్'. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫుల్ లెంగ్త్ యాక్షన్‌తో రూపొందింది. దీనికి సంబంధించిన షూటింగ్ చాలా రోజుల క్రితమే కంప్లీట్ అయింది. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను సైతం పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం చేసిన విషయం తెలిసిందే.

రవితేజ నటించిన 'ఈగల్' మూవీని ఈ ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, అప్పుడు సాధ్యం కాకపోవడంతో ఫిబ్రవరి 9వ తేదీన ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఇక, దీనికి సమయం దగ్గర పడడంతో ఈ మూవీ యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను స్పీడుగా సాగిస్తోంది. ఇలా ఇప్పటికే కొన్ని ఈవెంట్లు, ఇంటర్వ్యూలనూ పూర్తి చేసింది.
అదిరిపోయే స్టోరీతో హై ఓల్టేజ్ యాక్షన్‌తో రూపొందిన 'ఈగల్' మూవీ విడుదలకు సమయం దగ్గర పడడంతో నిర్మాణానంతర కార్యక్రమాలను సైతం పూర్తి చేసుకుంది. ఇలా ఇటీవలే ఈ చిత్రాన్ని సెన్సార్ సభ్యులు వీక్షించినట్లు తెలిసింది. అంతేకాదు, దీనికి సెన్సార్ బోర్డ్ సభ్యులు యూ/ఏ (U/A) సర్టిఫికెట్‌ను జారీ చేసినట్లు తాజాగా సమాచారం బయటకు వచ్చింది.

రవితేజ - కార్తీక్ ఘట్టమనేని కాంబోలో రూపొందిన 'ఈగల్' మూవీకి సంబంధించిన రన్ టైం వివరాలు కూడా తాజాగా తెలిశాయి. ఈ సమాచారం ప్రకారం.. ఈ మూవీ 2 గంటల 38 నిమిషాల (158 నిమిషాలు) పాటు ఉండబోతుందని తెలిసింది. ఇక, ఈ సినిమాను వీక్షించిన సెన్సార్ బోర్డ్ సభ్యులు ఫిదా అయ్యారట. ముఖ్యంగా క్లైమాక్స్ అదిరిపోయేలా ఉందని చెప్పారని టాక్.
ఇదిలా ఉండగా.. 'ఈగల్' సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. వివేక్ కూచిబొట్ల సహా నిర్మాతగా వ్యవహరించారు. దీనికి Davzand సంగీతాన్ని అందించారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, కావ్య తాపర్, మధు బాల సహా ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను పోషించారు.


Click it and Unblock the Notifications











