EAGLE Teaser: ఊహించని విధంగా ఈగల్ టీజర్.. చూడబోయేది విశ్వరూపం

తెలుగు చిత్ర పరిశ్రమలో మాస్ ఇమేజ్‌ను సొంతం చేసుకోవాలంటే సాధారణమైన విషయం కాదు. అలాంటిది దాన్నే ఇంటి పేరుగా మార్చుకుని సుదీర్ఘ కాలంగా సత్తా చాటుతోన్నాడు మాస్ మహారాజా రవితేజ. పక్కా కమర్షియల్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తోన్న అతడు.. వరుస ప్రాజెక్టులతో దూసుకెళ్తోన్నాడు. ఇలా ఇటీవలే 'టైగర్ నాగేశ్వరరావు' మూవీతో వచ్చాడు.

'టైగర్ నాగేశ్వర్రావు' మూవీతో దసరాలకు వచ్చిన మాస్ మహారాజా రవితేజ.. దీని ద్వారా మంచి ఫలితాన్ని మాత్రం సొంతం చేసుకోలేదు. దీంతో ఈ సారి ఎలాగైనా బిగ్ సక్సెస్‌ను ఖాతాలో వేసుకోవాలన్న పట్టుదలతో కనిపిస్తున్నాడు. ఇందుకోసం ఈ మాస్ హీరో.. టాలెంటెడ్ గాయ్ కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో 'ఈగల్' అనే సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే.

Ravi Teja Starrer EAGLE Movie Teaser Released

క్రేజీ కాన్సెప్టుతో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'ఈగల్' మూవీకి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే చాలా వరకూ పూర్తైంది. మిగిలిన దానితో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను సైతం వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా దీని నుంచి టీజర్‌ను రిలీజ్ చేసేశారు.

తాజాగా వచ్చిన 'ఈగల్' మూవీ టీజర్‌లో హీరో రవితేజ రోల్‌కు అదిరిపోయే ఎలివేషన్స్ ఇచ్చారు. అతడిని ప్రకృతిలోని ఎన్నో అంశాలతో పోలుస్తూ పవర్‌ఫుల్ డైలాగులు చెప్పారు. ముఖ్యంగా 'కొండలో లావాను కిందకు పిలవకు.. ఊరూ ఉండదు.. నీ ఉనికీ ఉండదు', 'ఇది విధ్వంసం మాత్రమే.. తర్వాత చూడబోయేది విశ్వరూపం' అనే డైలాగులు బాగా ఆకట్టుకున్నాయి.

'ఈగల్' మూవీ టీజర్‌లో రవితేజ లుంగీతో ఊరమాస్ గెటప్‌లో కనిపించి అలరించాడు. అలాగే, ఈ వీడియోలో విజువల్స్ ఎంతో గ్రాండ్‌గా ఉన్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా కొత్తగా అనిపించింది. మొత్తంగా 'ఈగల్' మూవీ టీజర్‌ను రవితేజ అభిమానులే కాకుండా.. అన్ని వర్గాల వాళ్లనూ ఆకట్టుకునేలా కట్ చేశారని చెప్పొచ్చు.

ఇదిలా ఉండగా.. 'ఈగల్' సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిబొట్ల సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దీనికి Davzand సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో నవదీప్, శ్రీనివాస్ అవసరాల, కావ్య తాపర్, మధు బాల సహా ఎంతో మంది ప్రముఖులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2024 జనవరి 13న రిలీజ్ చేయబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X