Valentines day: రవితేజ ఫ్యాన్స్‌కు వాలెంటైన్స్ డే గిఫ్ట్.. హీరోయిన్‌తో రొమాంటిక్‌గా మాస్ హీరో
తెలుగు చిత్ర పరిశ్రమలో విభిన్నమైన సినిమాలు చేస్తూ.. తనకంటూ విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు మాస్ మహారాజా రవితేజ. మరీ ముఖ్యంగా హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తోన్న అతడు.. కొద్ది రోజుల క్రితమే 'ఈగల్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదే సమయంలో పలు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టేశాడు.
వాస్తవానికి 'ఈగల్' మూవీ రాకముందే మాస్ మహారాజా రవితేన తన 74వ చిత్రాన్ని గోపీచంద్ మలినేనితో చేస్తున్నట్లు అనౌన్స్ చేశాడు. కానీ, ఇది అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. దీంతో ఇప్పుడా ప్రాజెక్టునే స్టైలిష్ డైరెక్టర్ హరీశ్ శంకర్‌తో చేస్తున్నాడు. 'మిస్టర్ బచ్చన్' అనే టైటిల్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం హిందీలో హిట్ అయిన 'రైడ్' మూవీకి రీమేక్‌గా వస్తుంది.

సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో రాబోతున్న 'మిస్టర్ బచ్చన్' సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ ఇటీవలే స్టార్ట్ అయింది. ఆ వెంటనే దర్శకుడు హరీశ్ శంకర్ పలు షెడ్యూళ్లను సైతం విజయవంతంగా పూర్తి చేసేశాడు. ఈ క్రమంలోనే ఇటీవలే మరో క్రేజీ షెడ్యూల్‌ను కంప్లీట్ చేశారు. ఇందులో హీరో, హీరోయిన్లపై కొన్ని క్రేజీ సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలిపారు.
రవితేజ - హరీశ్ శంకర్ కలయికలో ఎన్నో అంచనాలతో రూపొందుతోన్న 'మిస్టర్ బచ్చన్' మూవీ మొదలైన తర్వాత టైటిల్ పోస్టర్ వచ్చింది. దీనికి భారీ రెస్పాన్స్ వచ్చింది. దీని తర్వాత వరుసగా అప్‌డేట్లను కూడా ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రేమికుల రోజు (Valentines day)ను పురస్కరించుకుని ఈ చిత్రం నుంచి స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు.

'మిస్టర్ బచ్చన్' మూవీ నుంచి తాజాగా వచ్చిన పోస్టర్‌లో రవితేజ హీరోయిన్‌కు టైట్ హగ్ ఇస్తూ కనిపించాడు. ఇక, ఈ పోస్టర్‌ను విడుదల చేసిన చిత్ర యూనిట్ 'ఎంతటి మాస్ పర్సన్ అయినా సాఫ్ట్ హార్ట్‌ను కలిగి ఉంటారు. మిస్టర్ బచ్చన్ యూనిట్ నుంచి మీ అందరికీ ప్రేమికుల రోజు శుభాకాంక్షలు' అని తెలిపారు. మొత్తానికి ఈ పోస్టర్ విపరీతంగా వైరల్ అవుతోంది.
ఇదిలా ఉండగా.. రవితేజ హీరోగా హరీశ్ శంకర్ రూపొందిస్తోన్న 'మిస్టర్ బచ్చన్' మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. దీనికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











