Ravanasura Teaser: డేంజర్ అంటూ భయపెట్టిన రవితేజ.. ఈ రావణాసురుడిని దాటాల్సేందే
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి బ్యాగ్రౌండ్ లేకుండానే వచ్చి.. ఎంతో మంది టాలెంట్ ఉన్న వాళ్లకు రోల్ మోడల్‌గా మారిన హీరో మాస్ మహారాజా రవితేజ. కెరీర్ ఆరంభం నుంచీ హిట్లు ఫ్లాపులను ఏమాత్రం పట్టించుకోకుండా సినిమాలు చేస్తోన్న ఈ స్టార్ హీరో.. గత ఏడాది ఏకంగా మూడు చిత్రాలతో వచ్చాడు. అందులో 'ధమాకా' మాత్రమే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు, ఈ మూవీతో రవితేజ వంద కోట్ల క్లబ్‌లోకి చేరుకున్నాడు. అలాగే, ఈ సంక్రాంతికి వచ్చిన 'వాల్తేరు వీరయ్య' మూవీలో చిరంజీవితో కలిసి రవితేజ సందడి చేశాడు. ఇది ఏకంగా రూ. 200 కోట్లు పైగా వసూలు చేసి ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది.
హిట్లు మీద హిట్లు కొడుతూ ఫామ్‌లో ఉన్న మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం 'రావణాసుర' అనే చిత్రంలో నటిస్తోన్నాడు. టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా 2022 సంక్రాంతి పండుగకు మొదలెట్టారు. ఆ వెంటనే రెగ్యూలర్ షూటింగ్‌ను కూడా ప్రారంభించారు. ఇలా ఇప్పటి వరకూ పలు షెడ్యూళ్లను కూడా పూర్తి చేసుకుని దాదాపుగా టాకీ పార్టును పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు (మార్చి 6వ తేదీ) ఈ మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేశారు.
రవితేజ నటిస్తోన్న 'రావణాసుర' నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. ఇందులో అమ్మాయిల మర్డర్స్ జరుగుతుండడం.. ఆ బ్యాగ్రౌండ్‌లో రవితేజ ముఖం కనిపించం.. ఈ కేసు ఓ స్పెషల్ ఆఫీసర్‌కు అప్పగించడాన్ని చూపించారు. అంతేకాదు, ఇందులో సుశాంత్ కూడా వైల్డుగానే కనిపించాడు. మొత్తంగా ఈ వీడియోలో రవితేజను ఎంతో వైల్డుగా, స్టైలిష్‌గా చూపించారు. ఇక, ఇందులో విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా 'సీతను తీసుకెళ్లాలంటే లంకను దాటితే సరిపోదు.. ఈ రావణాసురుడిని దాటి వెళ్లాలి' అని రవితేజ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. దీంతో 'రావణాసుర' టీజర్‌కు భారీ రెస్పాన్స్ దక్కుతోంది.

ఇదిలా ఉండగా.. 'రావణాసుర' సినిమాను అభిషేక్ పిక్చర్స్, రవితేజ టీమ్ వర్క్స్ బ్యానర్లపై ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దీనికి హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో అను ఇమాన్యూయేల్, మీనాక్షి చౌదరి, ఫరియా అబ్ధాల్లా హీరోయిన్లుగా నటిస్తున్నారు. సుశాంత్ కీలక పాత్రను పోషిస్తోన్నాడు.


Click it and Unblock the Notifications











