టైగర్ నాగేశ్వర్రావు టీజర్ డేట్ ఫిక్స్: ఫస్ట్ టైమ్ అలా కనిపించనున్న రవితేజ
ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలోని చాలా మంది హీరోలు ప్రతి సినిమాకు తమ రేంజ్‌ను పెంచుకునే ప్రయత్నమే చేస్తున్నారు. అందులో మాస్ మహారాజా రవితేజ ఒకడు. గతంలో కంటే ఇప్పుడు మరింత జోష్‌తో సినిమాలు చేస్తోన్న అతడు.. 'ధమాకా'తో వంద కోట్ల క్లబ్‌లో చేరాడు. అప్పటి నుంచి ఇంకాస్త వేగంగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తూ దూసుకుపోతోన్నాడు.
ఈ ఏడాది 'రావణాసుర'తో వచ్చి డిజాస్టర్‌ను చవి చూసిన మాస్ మహారాజా రవితేజ.. ఇప్పుడు 'టైగర్ నాగేశ్వర్రావు' అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. వంశీ అనే దర్శకుడు తెరకెక్కిస్తోన్న ఈ సినిమా 1970 కాలంలో గజగజలాడించిన టైగర్ నాగేశ్వర్రావు జీవిత కథ ఆధారంగా రూపొందుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ గత ఏడాదే ప్రారంభం అయింది. అప్పటి నుంచి శరవేగంగా దీన్ని జరుపుకుంటూ వస్తున్నారు. ఇలా ఇప్పటికే రెండు పాటలు మినహా దాదాపుగా టాకీ పార్టును కూడా కంప్లీట్ చేసినట్లు తెలిసింది.

పాన్ ఇండియా రేంజ్‌లో ఐదు భాషల్లో రూపొందుతోన్న 'టైగర్ నాగేశ్వర్రావు' మూవీని దసరా కానుకగా విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే జూలై 8వ తేదీన ఈ చిత్రం నుంచి టీజర్‌ను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన ప్రకటనను చిత్ర యూనిట్ జూలై 1 లేదా 2 తేదీల్లో అధికారికంగా వెల్లడించే అవకాశం ఉందని అంటున్నారు.
ఇక, 'టైగర్ నాగేశ్వర్రావు' మూవీలో రవితేజ గతంలో ఎన్నడూ కనిపించని డిఫరెంట్ లుక్‌తో దర్శనమివ్వబోతున్నాడు. ముఖ్యంగా అతడు షర్ట్ లేకుండా సిక్స్ ప్యాక్ బాడీని చూపించబోతున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో రాబోతున్న టీజర్‌లోనే అతడి బాడీని రివీల్ చేయనున్నారట. ఇది రవితేజ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టేలా ఉంటుందని సమాచారం.
ఇదిలా ఉండగా.. రవితేజ కెరీర్‌లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'టైగర్ నాగేశ్వర్రావు' మూవీని తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. దీనికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించబోతున్నాడు. ఇందులో నుపూర్ సనన్ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ చిత్రం అక్టోబర్ 20న రిలీజ్ అవుతుంది.


Click it and Unblock the Notifications











