Waltair Veerayya: చిరంజీవికి ధీటుగా రవితేజ.. మతిపోగొట్టే ట్రీట్ రెడీ
ఆరు పదుల వయసులోనూ ఏమాత్రం అలసట చెందకుండా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నారు టాలీవుడ్ బడా హీరో మెగాస్టార్ చిరంజీవి. మరీ ముఖ్యంగా సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన జెట్ స్పీడుతో దూసుకుపోతోన్నారు. ఇలా ఇప్పటికే పలు చిత్రాలను కూడా ఆయన ప్రేక్షకులకు అందించారు. అయితే, వాటి ఫలితాలు ఎలా ఉన్నా ఆయన స్పీడు మాత్రం తగ్గడం లేదు. ఇలా ఇప్పుడు చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' అనే సినిమాను చేస్తున్నారు. ఇందులో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రను పోషిస్తోన్న విషయం తెలిసిందే.
క్రేజీ కాంబినేషన్‌లో సక్సెస్‌ఫుల్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర తెరకెక్కిస్తోన్న 'వాల్తేరు వీరయ్య' మూవీపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను జెట్ స్పీడుతో పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. అదే సమయంలో ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా దీపావళి పండుగ కానుకగా టైటిల్ టీజర్‌ను విడుదల చేసింది. దీనికి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత ఈ సినిమా నుంచి బాస్ పార్టీ అంటూ సాగే ఓ మాస్ పాటను కూడా విడుదల చేశారు. ఇది కూడా సూపర్ డూపర్ హిట్ అయింది.

పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'వాల్తేరు వీరయ్య' మూవీలో మాస్ మహారాజా రవితేజ కూడా నటిస్తున్నాడు. ఇప్పుడు అతడి పాత్రకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే ఈ వీడియోను డిసెంబర్ రెండో వారంలో రిలీజ్ చేయాలని చూస్తున్నట్లు ఓ న్యూస్ తాజాగా లీకైంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కట్ కూడా కంప్లీట్ అయినట్లు తెలిసింది. అంతేకాదు, దీనికి దేవీ శ్రీ ప్రసాద్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా కంప్లీట్ చేశాడని సమాచారం. ఇక, దీనికి సంబంధించిన ప్రకటన అతి త్వరలోనే రానుందని తెలిసింది.
మెగా మాస్ హీరోల కలయికలో రాబోతున్న 'వాల్తేరు వీరయ్య' మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచలి రవి శంకర్ నిర్మిస్తున్నారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











