Tiger Nageswara Rao: వేటాడేందుకు సిద్ధమైన రవితేజ.. ఫ్యాన్స్ పండుగ చేసుకోండి!
వరుస పెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు మాస్ మహారాజా రవితేజ. గతేడాది ధమాకాతో డబుల్ ట్రీట్ ఇచ్చిన రవితేజ ఈ సంవత్సరం సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవితో కలిసి వాల్తేరు వీరయ్యతో సందడి చేశాడు. ఆ వెనువెంటనే రావణాసుర మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేదు కానీ, ఓటీటీలో మాత్రం మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు పంజాతో వేటాడేందుకు సిద్ధమైన పులిలా వేటాడేందుకు రెడీ అయ్యాడు మాస్ మహారాజా. అంతేకాకుండా అభిమానులకు సూపర్ ట్రీట్ ఇవ్వనున్నాడు.
డైరెక్టర్ వంశీ కృష్ణ (Vamsi Krishna) దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం 'టైగర్ నాగేశ్వరరావు' (Tiger Nageswara Rao). ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. దానికి తగినట్లుగానే సినిమా మేకింగ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 20న ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే జోరుగా కొనసాగిస్తున్నారు.

ఇటీవల రాజమండ్రిలో చాలా గ్రాండ్ గా టైగర్ నాగేశ్వరరావు ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియోకు దగ్గుబాటి వెంకటేష్ వాయిస్ ఓవర్ అదిరిపోయింది. అంతేకాకుండా అందులో టైగర్ నాగేశ్వర రావు గురించి చెప్పే డైలాగ్స్ ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ గ్లింప్సులో వచ్చిన సీన్స్, సినిమాటోగ్రఫీ మైండ్ బ్లాక్ అయ్యేలా ఉన్నాయి. ఇక "బ్లాక్ పాంథర్" మూవీ సిరీస్ తరహాలో ఉన్న బీజీఎమ్ మాత్రం నెక్ట్స్ లెవెల్ లో ఉంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
టైగర్ నాగేశ్వరరావు టీజర్ ను ఆగస్ట్ 17న అంటే వచ్చే గురువారం విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన అధికారికంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. Tiger's Invasion (తెలుగులో పులి వేట అని అర్థం) పేరుతో టీజర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దీనికి సంబంధించి పోస్టర్ లో రవితేజ పాదాన్ని చూపిస్తూ క్యూరియాసిటీ పెంచేశారు. దీంతో రవితేజ అభిమానులు పండుగ చేసుకునే వార్తగా ఈ టీజర్ అనౌన్స్ మెంట్ డేట్ మారింది.
ఇదిలా ఉంటే 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా 1970-80 ప్రాంతంలో స్టువర్టుపురం గజదొంగగా పేరు మోసిన టైగర్ నాగేశ్వర రావు జీవిత కథ ఆధారంగా రూపొందుతోంది. ఇందులో రవితేజ పాత్ర చాలా భిన్నంగా ఉంటుందని సమాచారం. ఇక ఈ సినిమాలో కృతి సనన్ చెల్లెలు నూపుర్ సనన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది. మరో హీరోయిన్ గా గాయత్రి భరద్వాజ్ చేస్తోంది. ది కశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 సినిమాల నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తోంది. అనుపమ్ ఖేర్, రేణు దేశాయ్, జిషు సేన్ గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











