మాస్ రాజా సరసన పెళ్లిచూపులు భామ
మొన్నామధ్య రిలీజ్ అయిన డిస్కోరాజా తోపాటు అంతకుముందు నేల టికెట్టు- టచ్ చేసి చూడు- అమర్ అక్బర్ ఆంటోనీ ఇలా వరుసగా రవితేజకి నాలుగు ఫ్లాప్ లు పడ్డాయి. దాంతో మాస్ రాజా మార్కెట్ డల్ అయ్యింది. అందుకే ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు . ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'క్రాక్' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
'బలుపు-డాన్ శీను " వీరిద్దరి కాంబినేషనల్ వస్తున్న మూడో చిత్రం ఇదే కావడం విశేషం. గత రెండు సినిమాలు యావరేజ్ ఫలితాలను ఇచ్చాయి. దీంతో ఈసారి హిట్ కోసం 'క్రాక్' చిత్రం చేస్తున్నారని తెలుస్తోంది. దీని తర్వాత మాస్ రాజా మరో సినిమాకు కమిట్ అయిన విషయం తెలిసిందే. వీర ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా కమిట్ అయ్యాడట.

బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన 'రాక్షసుడు' సినిమాతో రమేష్ వర్మ హిట్ అందుకున్నాడు . ఆ సినిమా తమిళ హిట్ చిత్రం రాక్షసన్ కు రీమేక్. ఈ నేపథ్యంలో రవితేజతో రమేష్ వర్మ చేస్తోన్న చిత్రం కూడా రీమేక్ సమాచారం. ఇందులో రవితేజ డబుల్ రోల్ లో కనిపించనున్నాడట.
ఇక ఈ సినిమాలో రవితేజ కు జోడీగా యంగ్ బ్యూటీ రీతువర్మ నటిస్తుందని తెలుస్తుంది. అంతేకాదు ఇందులో అమ్మడి క్యారెక్టర్ ప్రత్యేకంగా ఉంటుందని తెలుస్తుంది. ఈసినిమాతో పాటు రీతూ వర్మ చేతిలో నాలుగు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మరి మాస్ రాజా తో ఈ అమ్మడి కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూడాలి .


Click it and Unblock the Notifications











