Don't Miss!
- Lifestyle
Today Rasi Phalalu : ఈ రోజు మీకు శుభమా లేదా అశుభమా ఎలా ఉంటుంది? ఏఏ రాశులకు ఎలా ఉంటుంది
- News
ఆపరేషన్ ఆకర్ష్: తెలంగాణ బీజేపీలో కీలక పాత్ర పోషించనున్న ఈటల రాజేందర్!
- Sports
IND vs ENG: ఇదెక్కడి పిచ్ రా అయ్యా.. ఇన్నింగ్స్ బ్రేక్‌లో రోలర్‌తో తొక్కించారా? వసీం జాఫర్ సెటైర్!
- Finance
20,000 డాలర్లకు దిగువనే బిట్ కాయిన్, క్రిప్టో మార్కెట్ ఇంకా ఆ స్థాయిలోనే
- Travel
అద్భుత కళాకృతుల నిలయం.. రఘురాజ్‌పూర్..
- Technology
భారత్‌లో 46 వేల ఖాతాలపై నిషేధం విధించిన Twitter!
- Automobiles
భారత మార్కెట్లో సుజుకి కటానా Suzuki Katana స్పోర్ట్స్ బైక్ విడుదల; ధర రూ.13.61 లక్షలు
Ramarao On Duty:రిలీజ్ డేట్ ఫిక్స్.. మాస్ మహారాజా.వచ్చేది ఎప్పుడంటే?
మాస్ మహారాజా రవితేజ ఎలాంటి సినిమా చేసినా కూడా మాస్ ప్రేక్షకులను ఏదో ఒక విధంగా ఆకట్టుకుంటూనే ఉంటాయి. క్రాక్ సినిమాతో గత ఏడాది బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న రవితేజ ఆ తర్వాత కూడా అదే తరహాలో వరుస విజయాలు అందుకోవాలని అనుకున్నాడు. కానీ ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఖిలాడి సినిమా మాత్రం ఈ హీరోకు సరైన గుర్తింపు ఇవ్వలేకపోయింది. అంతేకాకుండా రవితేజ కెరీర్ లోనే ఆ సినిమా మరో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ఎలాగైనా 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాతో మరో మంచి విజయాన్ని సొంతం చేసుకోవాలని సిద్ధమవుతున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన కొత్త రిలీజ్ డేట్ పై కూడా రవితేజ క్లారిటీ ఇచ్చేశాడు. సమ్మర్ అనంతరం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను కూడా భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాను గత రెండు నెలల నుంచి విడుదల చేయాలని చిత్ర యూనిట్ సభ్యులతో రవితేజ చర్చలు జరుపుతూనే ఉన్నాడు. ఇక ఫైనల్ గా జూన్ 10న రామారావు ఆన్ డ్యూటీ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా అసఫీషియల్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఇక ప్రస్తుతంఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాను కొత్త దర్శకుడు శరత్ మండవ తెరకెక్కిస్తూ ఉండగా సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఇక ఈ సినిమాలో రవితేజకు జోడిగా రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఇక సినిమాలో మాస్ రాజా ఒక నిజాయితీ గల ప్రభుత్వ అధికారి కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే విడుదల చేసిన టీజర్ సినిమాపై పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశారు. ఇక సినిమా పాటలను కూడా త్వరలోనే విడుదల చేయాలని చిత్ర యూనిట్ సభ్యులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా మంచి సక్సెస్ అందుకొని ట్రాక్ లోకి రావాలని రవితేజ ప్లాన్ చేస్తున్నారు. మరి సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి. క్రాక్ సినిమాతో రవితేజ ఏ స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు ప్రత్యేకంగా చెప్పనవసరం. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో కలెక్షన్స్ అంధించి ఒక విధంగా రవితేజ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లను అందుకుని మంచి లాభాలను అందించింది.
రవితేజ క్రాక్ సినిమాతో రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదు. కేవలం ఒక ఏరియా హక్కులను తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకోవడంతో రవితేజకు మంచి ప్రాఫిట్స్ వచ్చాయి. అయితే అదే తరహాలో ముందుకు సాగాలని రవితేజ ఖిలాడి సినిమా విషయంలో నమ్మకంతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ మాత్రం సక్సెస్ కాలేకపోయింది. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఖిలాడి సినిమా రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ లో ఒకటిగా నిలిచింది. అయినప్పటికీ రవితేజ కాన్ఫిడెన్స్ అయితే మాత్రం తగ్గలేదు. వెంటనే మరికొన్ని మంచి సినిమాలను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ప్రస్తుతం అతని చేతిలో ఉన్న రామారావు ఆన్ డ్యూటీ సినిమా తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తుందని ధీమాతో ఉన్నాడు.